Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ.. ఏకైక ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్!

టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. గత ఎడిషన్‌లోనే ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చగా.. తాజా ఎడిషన్‌లో షెఫాలీ వర్మ ఈ ఫీట్ సాధించింది.

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో షెఫాలీ వర్మ ఈ ఘనతను అందుకుంది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో సెంచరీ సాధించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సింగిల్ తీసి ఈ ఫీట్ సాధించింది.

IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!

IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!

ఆసియా కప్ టోర్నీ నుంచి షెఫాలీ వర్మ నిలకడగా రాణిస్తోంది. గత ఐదు నాకౌట్ మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 87 పరుగులు చేసిన షెఫాలీ వర్మ.. ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో 64, ఫైనల్లో 68, ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో 40, సెమీఫైనల్లో 100* పరుగులు చేసింది.

Shafali Verma Creates History as First Women s Cricketer to Score a Century at the Asian Games

షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌లో ఈ మ్యాచ్‌లో భారత్ 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(33 బంతుల్లో 6 ఫోర్లతో 40) మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసారు.

అనంతరం బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజాయాన్ని మూటగట్టుకుంది. దిలార అక్తర్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో నందని శర్మ(3/25), దీప్తి శర్మ(3/7) మూడేసి వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. తెలుగు తేజం శ్రీచరణి(2/7) రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గాడ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీసారు.

IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!

Also Read

IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!

ఈ విజయంతో భారత్ కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే స్వర్ణం.. ఓడితే రజతం భారత్‌కు దక్కుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన భారత్ హాట్ ఫేవరేట్‌గా ఈ ఫైనల్ బరిలోకి దిగనుంది. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. కాంస్య పోరులో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి.

Story first published: Sunday, September 20, 2026, 15:13 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+