Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నేనెందుకు కష్టపడాలి’.. సెలెక్టర్లపై సర్ఫరాజ్ ఖాన్ అసహనం!

భారత సెలెక్టర్ల తీరుపై టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఫిట్‌‌గా ఉండటంతో పాటు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నప్పటికీ.. భారత టెస్ట్ జట్టులో తిరిగి చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఎవరి కోసం కష్టపడాలి? అంటూ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి కోసమే కష్టపడుతున్నానని, లేకపోతే ఎప్పుడో వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు.

ICC World Cup 2027 టికెట్లకు ఫుల్‌డిమాండ్.. భారత్ X పాక్ మ్యాచ్‌కు 83 లక్షల దరఖాస్తులు!

ICC World Cup 2027 టికెట్లకు ఫుల్‌డిమాండ్.. భారత్ X పాక్ మ్యాచ్‌కు 83 లక్షల దరఖాస్తులు!

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్..రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడాడు. 'ప్రతీ రోజు ఉదయం లేవగానే నన్ను నేనే ప్రశ్నించుకుంటా. నేను ఎందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? ప్రాక్టీస్ కోసం ఉదయం 5 గంటలకే ఎందుకు నిద్ర లేవాలి? నేను ఇప్పటికే భారత్‌కు ప్రాతినిథ్యం వహించాను.

Sarfaraz Khan Opens Up on India Snubs Motivation and Father s Support Why Should I Wake Up at 5 AM

ఒకప్పుడు లావుగా ఉన్నానని అంతా హేళన చేయడంతో ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టి 22 కిలోలు తగ్గాను. కానీ నేను లావుగా ఉన్నప్పుడే బాగా ఆడానని ఆటపట్టిస్తున్నారు. కానీ నేను వీటిని పట్టించుకోను. సాధారణ ప్రయత్నాలతోనే ముంబై జట్టులో కొనసాగగలను. కానీ నా తండ్రి నౌషాద్ పడిన కష్టం చూసినప్పుడు.. ఆయన కోసం మైదానంలోకి వెళ్లి రాణించాలనిపిస్తోంది.

భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. కేవలం నా క్రికెట్‌పై దృష్టి పెడుతున్నాను. ఒకవేళ జాతీయ సెలెక్టర్లు పిలిస్తే.. భారత జట్టు తరఫున ఆడుతాను. లేకపోతే దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతాను.'అని సర్ఫరాజ్ ఖాన్ స్పష్టం చేశాడు.

IND vs NZ: కుల్దీప్, సిరాజ్‌కు నో ఛాన్స్.. న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs NZ: కుల్దీప్, సిరాజ్‌కు నో ఛాన్స్.. న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత్-ఏ జట్టులో కూడా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం కల్పించకపోవడంపై అతను తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ తరఫున ఇప్పటి వరకు 6 టెస్ట్‌లాడిన సర్ఫరాజ్ ఖాన్ 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 66 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 18 శతకాలతో 5354 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, November 3, 2026, 10:46 [IST]
Other articles published on Nov 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+