Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: కుల్దీప్, సిరాజ్‌కు నో ఛాన్స్.. న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. వన్డే సమరానికి సిద్దమైంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. టీ20 సిరీస్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలనే లక్ష్యంతో భారత్ ఉంది. మరోవైపు చివరి రెండు టీ20ల తరహాలోనే సమష్టి ప్రదర్శనతో వన్డేల్లో శుభారంభం చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది.

భారత వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్ ఆడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ ఆటగాళ్ల రీఎంట్రీతో టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు జరగనున్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలో ఆటగాళ్లు మారనున్నారు.

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

ఓపెనర్లుగా గిల్, రోహిత్..

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌‌కు తిరుగుండదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు ఆడినా భారత్ భారీ స్కోర్ చేస్తోంది.

India Playing XI for 1st ODI vs New Zealand No Place for Kuldeep Yadav and Mohammed Siraj

నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్లుగా ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. లేదంటే అక్షర్ పటేల్‌‌కు అవకాశం దక్కుతుంది. అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్ పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. పేలవ ఫామ్‌ నేపథ్యంలో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఆకిబ్ నబీని ఆడించాలనుకుంటే అన్షుల్ కాంబోజ్ బెంచ్‌కు పరిమితమవుతాడు.

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

Also Read

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!


న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్/మహమ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్/ఆకిబ్ నబీ.

తొలి మూడు వన్డేలకు భారత్ జట్టు:

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి(తొలి వన్డేకు మాత్రమే), ఆకిబ్ నబీ.

Story first published: Monday, November 2, 2026, 15:22 [IST]
Other articles published on Nov 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+