
లక్ష్మణ్ రికార్డు బ్రేక్..
1999లో హైదరాబాద్ స్టైలీష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఒక సీజన్‌లో సాధించిన 530 పరుగులను.. రాజ్‌కోట్ వేదికగా తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ (78)తో మొత్తం 605 పరుగులు చేసి అధిగమించాడు. ఓవరాల్‌గా ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
ఈ జాబితాలో కేసీ ఇబ్రహీం (709), ఇబ్రహిమ్ గ్రేమ్ హిక్(645), విజయ్ మర్చంట్ (634), హెండ్రెన్ (630) , బద్రినాథ్ (625), పంకజ్ ధర్మని (608) సర్ఫరాజ్ కన్నా ముందున్నారు.
ఇక సౌరాష్ట్రతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 88కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టల్లో ఉన్న ముంబై జట్టును సర్ఫరాజ్ గట్టెక్కించాడు. కానీ హాఫ్ సెంచరీని శతకంగా మార్చుకోవడంలో ముంబై బ్యాట్స్‌మన్ విఫలమయ్యాడు.

టాప్ బ్యాట్స్‌మన్ లిస్ట్
709 కేసీ ఇబ్రహీం 1947/48
645 గ్రేమ్ హిక్ 1990
634 విజయ్ మర్చంట్ 1941/42
630 హెండ్రెన్ 1929/30
625 బద్రీనాథ్ 2007/08
608 ధర్మణి 1999/2000
605 సర్ఫరాజ్ ఖాన్ 2019/20
575 ఈడీ వీకెస్ 1950
558 జేక్ మాన్ 1951
545 ఆర్ బీ సింప్సన్ 1959/60
538 వీవీఎస్ లక్ష్మణ్ 1997/98
530 వీవీఎస్ లక్ష్మణ్ 1999/00

రెండో ఆటగాడిగా..
ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ, తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అతని కన్నా ముందు తమిళనాడు ప్లేయర్ వీవీ రామన్ ఒక్కడే 1989లో 313, 200తో ఈ ఫీట్ సాధించాడు.
మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

ట్రిపుల్‌తో దిగ్గజాల సరసన..
అజేయ ట్రిపుల్ సెంచరీతో ముంబై తరఫున ఈ ఘనతనందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబై తరఫున ట్రిపుల్ సెంచరీలు సాధించారు. సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ ఓవరాల్‌గా ముంబై తరఫున 8వది కాగా.. వసీం జాఫర్ రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. చివరికి ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. కెరీర్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) ఇదే అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.
వరుసగా మూడో రికార్డు..
ఈ సీజన్ రంజీలో అదరగొడుతున్న సర్ఫరాజ్ వరుసగా మూడో మ్యాచ్‌లో రాణించి ముచ్చటగా మూడో రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలుత (301 నాటౌట్) ట్రిపుల్ .. ఆతర్వాత (226 నాటౌట్) డబుల్ సెంచరీలతో రికార్డ్స్ ట్రబుల్ ఇచ్చిన సర్ఫరాజ్.. సౌరాష్ట్రతో మంగళవారం ప్రారంభమైన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన దిగ్గజాల జాబితాలో చేరాడు.


Click it and Unblock the Notifications

ఆయనే నా విన్నర్.. క్రేజీ క్రికెటర్‌పై మనసు పడ్డ దిశా పటానీ