నేను కాదు.. అతని వల్లే భారత్‌కు విజయం: సంజూ శాంసన్
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌పై సంజూ శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని అసాధారణ ప్రదర్శనతోనే న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా విజయం సాధించిందని అభిప్రాయపడ్డాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ తనకు దక్కినా.. ఈ గెలుపు క్రెడిట్ మాత్రం అతనిదేనని చెప్పాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాటు నమన్ ధీర్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించగలిగింది.

నమన్ ధీర్ భవిష్యత్తు ఆశాకిరణం..
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సంజూ శాంసన్.. నమన్ ధీర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'న్యూజిలాండ్‌తో తొలి టీ20 విజయంలో నా కంటే నమన్ ధీర్‌కే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. అంతర్జాతీయంగా అంతగా అనుభవం లేకున్నా.. అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా.. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు.
న్యూజిలాండ్ బౌలింగ్ ఎటాక్‌ను అడ్డుకొని భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. రాబోయే కాలంలో అతను టీమిండియాకు ఆశాకిరణంగా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
మాకు ఏ లోటు లేదు..
తీరిక లేని షెడ్యూల్ గురించి ప్రశ్నించగా.. అందుకు అనుగుణంగానే బీసీసీఐ తమకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పట్లు చేస్తుందని సంజూ శాంసన్ బదులిచ్చాడు. బిజినెస్ క్లాస్ ప్రయాణాలు.. లగ్జరీ హోటల్లో బస చేస్తున్నామని చెప్పాడు. 'ఇంగ్లండ్ టూర్ నుంచే మేం ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. బిజీ షెడ్యూల్‌కు సంబంధించి అన్ని విషయాలను చర్చించుకున్నాం.
ఫిట్‌నెస్ విషయంలో రాజీపడేది లేదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. శారీరకంగానే కాకుండా మానసికంగానూ మేం ఫిట్‌గా ఉన్నాం. మా ప్రయాణాలు అన్నీ బిజినెస్ క్లాస్‌లోనే సాగుతాయి. లగ్జరీ హోటల్లో బస చేస్తాం. కాబట్టి ఏ మిషయంలోనూ మేం ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. కాబట్టి మ్యాచ్‌లు, సిరీస్‌లు గెలవడంపైనే మేం ఫోకస్ పెట్టాం.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


