Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: కేఎల్ రాహుల్ ఔట్.. 21 ఏళ్ల జార్ఖండ్ కుర్రాడికి చోటు!

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మూడు అనధికారిక టెస్ట్‌ల సిరీస్ కోసం ధ్రువ్ జురెల్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు‌ను బీసీసీఐ ప్రకటించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా ఈ అనధికారిక టెస్ట్ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌కు ఎంపికైన టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడనున్నాడు.

2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ ఆడుతాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ ఆడుతాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ నేపథ్యంలో అతన్ని చివరి రెండు అనధికారిక టెస్ట్ సిరీస్‌ల నుంచి తప్పించారు. అతని స్థానంలో జార్ఖండ్‌కు చెంది 21 ఏళ్ల లెఫ్టార్మ్ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ మోహన్‌ను ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ శనివారం(అక్టోబర్ 24) ప్రారంభమయ్యే తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడనున్నాడు. ఆ తర్వాత భారత వన్డే జట్టుతో కలవనున్నాడు.

Shikhar Mohan Replaces KL Rahul in India A Squad for Two Matches Against New Zealand A

ఎవరీ శిఖర్ మోహన్..?

గతేడాదే రంజీ ట్రోఫీ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన శిఖర్ మోహన్.. ఇప్పటి వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి 1109 పరుగులు చేశాడు. చెన్నై వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇరానీ కప్‌లోనూ 60 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు సాధించాడు. కేరళపై 143 పరుగులు చేసిన శిఖర్ మోహన్.. మహారాష్ట్రపై 127 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

గాయం కారణంగా ఇప్పటికే రిషభ్ పంత్ ఈ అనధికారిక టెస్ట్ సిరీస్‌కు దూరం కాగా.. జార్ఖండ్‌కే చెందిన కుమార్ కుశాగ్ర జట్టులోకి వచ్చాడు. అయితే యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు తమిళనాడు ప్లేయర్ సాయి సుదర్శన్‌తో శిఖర్ మోహన్‌లకు తీవ్ర పోటీ నెలకొంది.

CSK శివమ్ దూబేను ఫ్రీగా వదిలేసి అతన్ని తీసుకోవాలి: క్రిష్ శ్రీకాంత్

Also Read

CSK శివమ్ దూబేను ఫ్రీగా వదిలేసి అతన్ని తీసుకోవాలి: క్రిష్ శ్రీకాంత్

ఆస్ట్రేలియాతో ఏ సిరీస్‌లో సాయి సుదర్శన్ ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పటికీ.. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శిఖర్ మోహన్‌కే ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలుఎక్కువగా ఉన్నాయి. అతను న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటితే.. భారత టెస్ట్‌ టీమ్‌లో కూడా అవకాశం దక్కవచ్చు.

Story first published: Friday, October 23, 2026, 15:55 [IST]
Other articles published on Oct 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+