Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమే: సంజూ శాంసన్

భారత తుది జట్టు నుంచి తనను తప్పించడం సరైన నిర్ణయమేనని స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇలాంటి తాను ఎన్నో చూశానని వెల్లడించాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

అయితే టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కాదని సంజూ శాంసన్‌ను ఆడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ.. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీకి మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. జింబాబ్వే పర్యటనకు సంజూను దూరంగా ఉంచింది. ఈ అవకాశాన్ని వైభవ్ సద్వినియోగం చేసుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

Sanju Samson Opens Up on Being Dropped for Vaibhav Sooryavanshi You Are Seeing a 15-Year-Old Boy

గంభీర్ నాతో మాట్లాడాడు..

15 ఏళ్ల వయసులోనే వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో సంజూ శాంసన్‌ ప్రదర్శనను జనాలు మర్చిపోయారు. రెండో టీ20 అనంతరం ఇదే విషయాన్ని సంజూ శాంసన్ ముందు ప్రస్తావించగా.. ఇది సహజమేనని అభిప్రాయపడ్డాడు. తనను తప్పించే విషయంలో కెప్టెన్ తప్పేం లేదన్నాడు. అయితే ఓ ఆటగాడిని తప్పించాలనుకున్నప్పుడు సరిగ్గా కమ్యూనికేట్ చేయాలని, ఆ విషయంలో గంభీర్ తనతో సుదీర్ఘంగా మాట్లాడాడని తెలిపాడు.

'కొన్ని వైఫల్యాల తర్వాత విమర్శలు రావడం సహజమే. భారత క్రికెటర్‌గా వైఫల్యాలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ అలాంటి సమయాల్లోనే అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు విమర్శలను పక్కనపెట్టేందుకు ప్రయత్నిస్తా. ప్రతి మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తా. విఫలమైతే మళ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా.. రిస్క్ తీసుకొని షాట్స్ ఆడుతాను.

IND vs AFG: ఓపెనర్ల విధ్వంసం.. ఒకే ఓవర్లో 6,1,6,4,4,6 (వీడియో)

Also Read

IND vs AFG: ఓపెనర్ల విధ్వంసం.. ఒకే ఓవర్లో 6,1,6,4,4,6 (వీడియో)

ఓ కెప్టెన్‌గా అర్థం చేసుకోగలను..

జట్టు కెప్టెన్‌గా ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎదురయ్యే సవాళ్ల ఏంటో నాకూ బాగా తెలుసు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేశా. నా పరిధిలో ఉన్న విషయాలపై ఎలా దృష్టి పెట్టాలో నాకు తెలుసు. దేశం కోసం, జట్టు కోసం ఆడుతున్నప్పుడు మ్యాచ్ గెలవడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాలు.
ఓ 15 ఏళ్ల కుర్రాడు భారీగా పరుగులు చేసి రెడీగా ఉన్నాడు. అంతకుముందు ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా నేను నిలిచా. కానీ ఆ తర్వాత ఆ కుర్రాడు అద్భుతంగా ఆడాడు. ఆ సమయంలో నేను ఓ రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాను.

ఆ కుర్రాడిని ఆడించాలని మేనేజ్‌మెంట్ భావించింది. కెప్టెన్సీ కోణంలో అది సరైన నిర్ణయమే. ఐపీఎల్‌లోనూ ఇలాంటివి ఎన్నో చూశా. అయితే తప్పించాలనుకునే ప్లేయర్‌కు సరిగ్గా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. ఆ విషయంలో గంభీర్ నాతో సుదీర్ఘంగా మాట్లాడాడు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, September 16, 2026, 12:15 [IST]
Other articles published on Sep 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+