IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌కు ఆదరణ కరువైంది. ఇప్పటికే తొలి రెండు టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. వాటిని జనాలు లైట్ తీసుకున్నారు. ఈ సిరీస్‌పై టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్ పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వైభవ్ సూర్యవంశీ లేకపోవడంతో మ్యాచ్ చూడటం ఆపేసి సినిమా చూశామని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వైభవ్‌ను ఆడించకపోవడంపై తన సతీమణి కూడా ప్రశ్నించిందని శ్రీకాంత్ వెల్లడించాడు. 1983 ప్రపంచకప్ విన్నర్ అయినా శ్రీకాంత్ ఒక్కరే కాదు.. మెజార్టీ భారత క్రికెట్ అభిమానులు వైభవ్ లేడని తెలియగానే టీవీ ఛానెల్స్ మార్చేసారు. ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
క్రౌడ్ పుల్లర్‌గా వైభవ్..
ఓ నెటిజన్ అయితే ఫ్యాన్ కోడ్ రిచార్జ్ దండుగ అని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనంతరం.. పొట్టి ఫార్మాట్‌లో వైభవ్ క్రౌడ్ పుల్లర్‌గా మారాడు. 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిక్సర పిడుగు ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతోనే వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. కానీ తొలి రెండు టీ20ల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఈ సిరీస్‌ను లైట్ తీసుకున్నారు.

వైభవ్ గైర్హాజరీ ఒక కారణమైతే.. మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడం, అఫ్గాన్ కనీస పోటీ ఇవ్వకపోవడం, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కాకుండా సోనీ టీవీ ఛానెల్స్, ఫ్యాన్ కోడ్ వేదికగా ఈ మ్యాచ్‌లు రావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. ఈ ఒక్క సిరీస్ కోసం ప్రత్యేకంగా రిఛార్జ్ చేసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపించలేదు. దాంతోనే ఈ సిరీస్‌కు ఆదరణ కరువైంది. కొందరు క్రికెట్ అభిమానులు జస్ట్ స్కోర్ అప్‌డేట్స్ ఫాలో అయ్యారు. వినాయక చవితి పండుగ ఎఫెక్ట్ కూడా ఈ సిరీస్‌పై పడింది. గణేష్ నవరాత్రుల్లో నిమగ్నమైన ఫ్యాన్స్.. మండపాల్లోనే గడపడంతో ఈ సిరీస్‌ను లైట్ తీసుకున్నారు.
భారత్‌దే సిరీస్..
ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ 7 వికెట్ల తేడాతోనే ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. తొలి టీ20లో అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ సత్తా చాటితే రెండో టీ20లో సంజూ శాంసన్, నితీష్ కుమార్ రెడ్డి రాణించారు. గురువారం జరిగే ఆఖరి టీ20లోనైనా వైభవ్ సూర్యవంశీ ఆడుతాడా? అంటే అవునని చెప్పే పరిస్థితులు లేవు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


