Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తృప్తే వేరు.. కీపింగ్ చేసేటప్పుడే డిసైడ్ అయ్యా: సంజూ శాంసన్

జట్టు విజయంలో మనవంతు పాత్ర ఉంటే ఆ తృప్తే వేరని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. న్యూజిలాండ్ పర్యటనను విజయంతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఆ విజయంలో తాను భాగమవ్వడం మరింత ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అభిషేక్ శర్మతో కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 6 ఓవర్లలోనే 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

మనవంతు పాత్ర ఉంటే ఆ తృప్తే వేరు..

ఈ సందర్భంగా మాట్లాడిన సంజూ శాంసన్.. తన బ్యాటింగ్ ప్రణాళికలను పంచుకున్నాడు. కీపింగ్ చేసే సమయంలోనే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. 'ఈ సిరీస్‌ను గెలుపుతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నా. జట్టు విజయంలో మనవంతు పాత్ర ఉంటే ఆ తృప్తే వేరు. ఈ విజయంలో ప్రతీ ఒక్కరూ తమవంతు సహకారం అందించారు.

Sanju Samson Opens Up After India s Win Over New Zealand Says It Feels Good to Be on Winning Side

ఇది సమష్టి విజయం. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. క్రీజులో ఉన్నప్పుడు మేమిద్దరం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆ మాటల్లో అర్థం పర్థం ఏం ఉండదు. బంతి చూసి ఆడు అనే చెప్పుకుంటాం. ఈ ఫార్మూలా మాకు బాగా వర్కౌట్ అవుతోంది.

కీపింగ్ చేసేటప్పుడే డిసైడ్ అయ్యా..

రెండో ఇన్నింగ్స్‌లో బంతి చాలా బాగా స్వింగ్ అయింది. కానీ బ్యాట్‌పైకి ముద్దుగా వచ్చింది. అందుకే పవర్ ప్లేలో సానుకూల మైండ్‌సెట్‌తో ఆడాలని నేను, అభి అనుకున్నాం. మాకు ఆరంభంలోనే మంచి రన్ ‌రేట్ వచ్చేసరికి మ్యాచ్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించవచ్చని అనిపించింది. 6 ఓవర్లలోనే 90 పరుగులు రావడం గొప్ప ఆరంభం. అందుకే ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాలనుకున్నాం.

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

Also Read

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

వికెట్ కీపింగ్ చేయడం వల్ల పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. కీపింగ్ చేస్తున్నప్పుడే బ్యాటింగ్ ఎలా చేయాలనే ఆలోచనలు మైండ్‌లో ఓ మూల నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు కీపింగ్ చేస్తున్నప్పుడు పిచ్ గురించి ఒక అంచనాకి వచ్చాను. తొలి ఇన్నింగ్స్‌లో గుడ్ లెంగ్త్‌లో వేసిన బంతి కాస్త ఆగుతూ వచ్చింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఔట్ ఫీల్డ్‌లో మంచు ఎక్కువగా ఉండటంతో బంతి బ్యాట్‌పైకి వచ్చింది. అందుకే ఈ రోజు బ్యాటింగ్‌ను ఆస్వాదించాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 22, 2026, 20:27 [IST]
Other articles published on Oct 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+