Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తెలుగు సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజూ శాంసన్!

టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన జైలర్-2 చిత్రం చూసేందుకు సంజూ శాంసన్ ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఈ విషయాన్ని సంజూ శాంసనే స్వయంగా వెల్లడించాడు. రజనీకాంత్ సినిమాలను రిలీజ్ రోజే చూస్తానని, ఈసారి మాత్రం మిస్సయ్యానని తెలిపాడు.

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

'నాకు రజనీ సర్ చిత్రాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాను. ఈసారి జైలర్ 2 మూవీని రిలీజ్ రోజు చూడలేకపోయాను. ఒక రోజు ఆలస్యంగా చూశాను. వీలైనంతరం వరకు తొలి రోజే రజనీ సర్ మూవీస్‌ను చూడటానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక ఈవెంట్ కారణంగా ఈ సారి మిస్సయ్యాను.

Sanju Samson Books Entire Cinema Hall for Jailer 2 Plans Movie Outing with India Teammates

కానీ అదృష్టవశాత్తూ థియేటర్ మొత్తం బుక్ చేసుకొని నా సతీమణి, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసే అవకాశం లభించింది. బిగ్‌స్క్రీన్‌పై రజనీ సర్‌ను చూసి చాలా సంబరపడ్డాను. మా జట్టులో తమిళం వచ్చిన ప్రతీ సపోర్టింగ్ స్టాప్ మెంబర్ ఈ సినిమాకు హాజరయ్యారు.'అని సంజూ శాంసన్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంజూ శాంసనే కాకుండా రజనీకాంత్ ఆరాధించే క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా సంజూ శాంసన్‌కు డైహార్డ్ ఫ్యానే.

సూపర్ డూపర్ హిట్..

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జైలర్‌ 2' బాక్సాఫీసును షేక్ చేస్తోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం.. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.317.15 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జైలర్‌ 2' తొలి వారాంతంలోనే భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

న్యూజిలాండ్ పర్యటనకు సంజూ శాంసన్..

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం సంజూ శాంసన్ సిద్దమవుతున్నాడు. గురువారం జరిగే తొలి టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే భారత జట్టు అక్కడికి చేరి ముమ్మరంగా సాధన చేస్తోంది. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో సంజూ పర్వాలేదనిపించాడు.

Story first published: Tuesday, October 20, 2026, 10:07 [IST]
Other articles published on Oct 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+