సూర్యవంశీ, జైస్వాల్‌ను వదులొద్దు.. కఠినంగా వ్యవహరించాలి: సంజయ్ మంజ్రేకర్
టీమిండియా యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ పట్ల బీసీసీఐ, ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అలా చేస్తేనే క్రికెట్‌తో పాటు కుర్రాళ్లకూ మంచిదని వ్యాఖ్యానించాడు.
శ్రీలంక పర్యటనలో ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించారు. భారత్-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ.. టెస్ట్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడ్డారు. ఈ ఘటనల్లో వైభవ్‌పై చర్యలు తీసుకోలేదని, కానీ యశస్వి జైస్వాల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ పడింది.
తాజాగా ఈ ఇద్దరి గొడవలను ప్రస్తావించిన సంజయ్ మంజ్రేకర్.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. 'భారత్-ఏకు ఆడుతున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ.. తాజా టెస్ట్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ప్రవర్తన అస్సలు బాగోలేదు.

ఐసీసీ, బీసీసీఐ వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. అలాంటి ప్రవర్తనను పునరావృతం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అవుతుంది. ఇది ఆటకు మంచి కాదు. అలాగే యువ క్రికెటర్ల భవిష్యత్తుకు ప్రమాదకరం.'అని సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
గత జూన్‌లో శ్రీలంక-ఏతో భారత్-ఏ ట్రై సిరీస్ ఆడింది. ఈ సిరీస్ సందర్భంగా శ్రీలంక ప్లేయర్ విషేన్ హలమ్‌తో వైభవ్ సూర్యవంశీ గొడవపడ్డాడు. ఔటై వెళ్తున్న వైభవ్‌ను విషేన్ హలమ్ ఏదో అనగా.. అతను కూడా దీటుగా బదులిచ్చాడు. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లినంత పనైంది.
సహచరులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే వైభవ్‌తో పాటు లంక ప్లేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత్-ఏ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అధికారం ఐసీసీకి లేకపోవడంతో ఈ ఇద్దరూ ఆటగాళ్లు తప్పించుకున్నారు. కానీ తాజా ఘటనలో యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. కానీ ఇది సరిపోదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

