భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అనుకుంటా.. సీజేపీకి మద్దతుగా మాజీ క్రికెటర్!
భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్న మంజ్రేకర్.. ప్రభుత్వ అణచివేతలను తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును సంజయ్ మంజ్రేకర్ ఎండగట్టారు.
'శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. నాకు తెలిసీ భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అనుకుంటా.'అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి భారీ మద్దతు లభించినా.. క్రికెట్, సినీ సెలెబ్రిటీలు మాత్రం మౌనం వీడలేదు. కానీ సంజయ్ మంజ్రేకర్ నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో నెటిజన్లు అతన్ని కొనియాడుతున్నారు.
పోలీసుల వలయంలో ఢిల్లీ..
ఇక సీజేపీ నిరసనలను ఢిల్లీ పోలీసులు, కేంద్రం ప్రభుత్వం కలిసి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. ఢిల్లీకి బయటి నుంచి రాకపోకలు సాగించకుండా అడ్డుకోవడంతో పాటు భారీ ఎత్తున ఆంక్షల్ని అమలుచేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్, సౌరవ్ దాస్ లను విమానంలోనే అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అణచివేతను ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజాస్వామ్య వాదులు తప్పుబడుతున్నారు.

సీజేపీ కీలక నేతల అరెస్ట్‌తో జంతర్ మంతర్ నిరసనల్ని నడిపించేందుకు బాధ్యతలు తీసుకున్న సీజేపీ మరో నేత అజింక్య షిండే నిరసనకారులకు కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. తమ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన నేతలు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను మోడీ-షా సర్కార్ ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుందని సీజేపీ కొత్త బాస్ అజింక్య షిండే తెలిపారు.
యువతకు మోదీ ప్రభుత్వం భయపడింది..
ఈ నియంతృత్వ ప్రభుత్వం దేశంలోని యువతకు మరోసారి భయపడిందని ఆయన పేర్కొన్నారు. గతంలో దేశమంతా ఒక్కటై జంతర్ మంతర్ కు వచ్చినప్పుడు మోడీ-షా సర్కార్ అహంకారాన్ని తాము బద్దలు కొట్టామన్నారు. అందుకే మరోసారి జంతర్ మంతర్ కు మేం రాకుండా రైళ్లు, రోడ్లు బంద్ చేసిందన్నారు. భారీ ఎత్తున జనాన్ని అదుపులోకి తీసుకొంటున్నారని, ఇది మోడీ-షా భయాన్ని బయటపెడుతోందన్నారు.
ఈ పోరులో తాము ఇప్పటికే సగం విజయం సాధించామని అజింక్య షిండే గుర్తుచేశారు. మరో కొత్త పోరాటానికి ఇది ఆరంభం అన్నారు. మాతో పాటు ఈ దేశ ప్రజలు కూడా తమ ఓటు హక్కు చోరీకి గురైందని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ దీన్ని లాక్కున్నారని, దీన్ని తిరిగి ఇవ్వమని కోరుతున్నామన్నారు. అలాగే దీనికి కారణమైన సీఈసీ రాజీనామా చేయాలని కోరుతున్నామని తెలిపారు. దీన్ని తట్టుకోలేక ఢిల్లీ మొత్తం అత్యవసర పరిస్ధితి సృష్టించిందన్నారు. అందుకే ఎక్కడ ఉన్న నిరసనకారులైనా జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని, పోలీసులు అడ్డుకుంటే మాత్రం అక్కడే జంతర్ మంతర్ గా మార్చుకుని ఆందోళనలు కొనసాగించాలన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకూ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


