Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్ లేకపోయినా భారత జట్టుకు నష్టం లేదు: మాజీ క్రికెటర్

2027 వన్డే ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడినా.. ఆడకపోయినా భారత జట్టుకు ఎలాంటి సమస్య ఉండదని టీమిండియా మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్లు ఉన్నారని అభిప్రాయపడ్డాడు.

టెస్ట్, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరూ మెగా టోర్నీ వరకు కొనసాగుతారా? ఫిట్‌‌గా ఉంటారనే ప్రశ్నలు తరుచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడటంపై ఎక్కువగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!

IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!

టీమిండియాకు ఒరిగేదేం లేదు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహాంరపై మాట్లాడిన సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగేది లేనిది రోహిత్, కోహ్లీలపైనే ఆధారపడి ఉందని చెప్పుకొచ్చాడు. 'అంతా ఈ ఇద్దరి ఆటగాళ్ల చేతుల్లోనే ఉంది. వాళ్లకు ఇంకొంత కాలం ఆడాలని ఉందా? తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలరా? అసలు సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు? కోహ్లీ, రోహిత్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా?

Sandip Patil Says Rohit Sharma and Virat Kohli s Presence Won t Make a Difference in 2027 World Cup

ఇప్పుడు ఆడుతున్న ఆటగాళ్లతో పాటు... ఒకవేళ వారిని జట్టు నుంచి పక్కన పెట్టాల్సి వస్తే, వారి స్థానాలను భర్తీ చేయగల సత్తా ఉన్నవాళ్లు మనకు అందుబాటులో ఉన్నారా? లేదా అనేది కూడా ఆలోచించాలి. మన భారత జట్టు బెంచ్ బలం చూస్తుంటే మాత్రం... విరాట్, రోహిత్ టీమ్‌లో ఉన్నా లేకపోయినా మనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదనే నేను అనుకుంటున్నాను.

బుమ్రా లేకున్నా..

కోహ్లీ, రోహిత్‌లు సుదీర్ఘ కాలంగా భారత జట్టుకు ఆడుతున్నారు. ఈ ఆటలోనే దిగ్గజాలుగా నిలిచిపోతారు. వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం మన దగ్గర గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ముగ్గురు, నలుగురు బౌలర్లు ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమైనా భారత బౌలింగ్ విభాగానికి వచ్చే నష్టం ఏం లేదు. ఎవరో ఒకరు అతని స్థానాన్ని భర్తీ చేస్తారు.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

రెండు రోజుల క్రితమే నేను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌‌ను సందర్శించాను. వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి అక్కడి సదుపాయాలను చూశాను. అక్కడ నిజంగా బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ పని చేసింది. ఇలాంటి వరల్డ్ క్లాస్ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే.. భవిష్యత్తులో భారత క్రికెట్ నుంచి మంచి బౌలర్లే కాదు.. టాప్ క్లాస్ బ్యాటర్లు కూడా వస్తారు. ఆ నమ్మకం నాకుంది.'అని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, September 20, 2026, 17:43 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+