Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను టీమిండియా ఫ్యూచర్.. కానీ తొందరొద్దు: జయసూర్య

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీది భిన్నమైన నైపుణ్యమని కొనియాడాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు టీమిండియా ఫ్యూచర్ అని తెలిపిన జయసూర్య.. అతని విషయంలో మేనేజ్‌మెంట్ తొందరపడవద్దని సూచించాడు. అతనికి తగినంత సమయం ఇచ్చి నిదానంగా ఎదుగనివ్వాలని సలహా ఇచ్చాడు.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

తొందరొద్దు..

ఆదివారం కార్పొరేట్ వరల్డ్ కప్ టోర్నీని ప్రారంభించిన జయసూర్య.. మీడియాతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వైభవ్ ప్రతిభ భిన్నమైనది. అతను భారత భవిష్యత్తు. అయితే అతని ముందు చాలా టైమ్ ఉంది. కాబట్టి బాగా రాణించడానికి సరైన అవకాశం ఇవ్వాలి. కచ్చితంగా తన ప్రతిభను నిరూపించుకుంటాడు.

Sanath Jayasuriya Says Vaibhav Sooryavanshi Can Be India s Future But Warns Against Rushing Him

అతని అవకాశాలు వస్తాయి. కానీ అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది నేను చెప్పలేను. అతని బ్యాటింగ్ స్థానం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. కాబట్టి కాస్త వేచి చూద్దాం. టీమ్ సెలెక్షన్, బ్యాటింగ్ ఆర్డర్‌పై నేను ఏలాంటి కామెంట్ చేయలేను. కానీ వైభవ్ మాత్రం సూపర్ టాలెంటెడ్. ప్రతి ఆటగాడికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. వైభవ్.. ప్రాక్టీస్, ట్రైనింగ్‌లో చాలా కష్టపడుతాడు.

భారత్‌లో తీవ్ర పోటీ..

భారత్‌లో ఎప్పుడూ ఒకరి స్థానాన్నిభర్తీ చేయడానికి, మెరుగైన ప్రదర్శన చేసేందుకు మరో ఆటగాడు సిద్దంగా ఉంటారు. భారత జట్టులో విపరీతమైన పోటీ ఉంటుంది. భారత క్రికెట్ స్టాండర్డ్స్ చాలా హై రేంజ్‌లో ఉంటాయి. వాళ్లు వన్డేలు, టీ20లు, టెస్టులు అని అన్ని ఫార్మాట్లు ఆడుతారు. అన్నింటిలోనూ ఆడటం అంత తేలికైన విషయం కాదు.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

Also Read

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

దేశం తరఫున ఆడాలనే కసి, పిచ్చి భారత ఆటగాళ్లకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ప్లేయర్లు బాగా రాణిస్తున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలని తపన పడుతున్నారు. ఐపీఎల్, స్టేట్ టీమ్స్, ఇతర పైస్థాయి లీగ్స్‌లో అవకాశాలు రాని ఆటగాళ్లకు కార్పొరేట్ లీగ్ మంచి వేదిక. తమలో కూడా దేశానికి ఆడే సత్తా ఉందని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం.'అని జయసూర్య చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, September 20, 2026, 22:06 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+