రోహిత్‌తో పెట్టుకున్న అగార్కర్ ఇప్పుడు రిగ్రెట్ అవుతుండొచ్చు: మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పశ్చాత్తపపడుతూ ఉండవచ్చని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ అన్నాడు. రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించాలని చూసిన అగార్కర్.. తన పదవి కోల్పోయాడని, ప్రస్తుతం హిట్ మ్యాన్ బ్యాటింగ్ చూసి కచ్చితంగా రిగ్రెట్ అవుతాడని అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టులో కొనసాగించడంపై అగార్కర్ విముఖత చూపాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో మూడు వన్డేల సందర్భంగా రోహిత్ భవిష్యత్తుపై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చారని, ఆ సిరీసే అతనికి చివరిది కానుందని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ ఖండించింది. తాను ఆడుతున్నంత వరకు రోహిత్ జట్టులో కొనసాగుతాడని స్పష్టం చేసింది.

అగార్కర్ బాధపడుతొండొచ్చు..
మరోవైపు రోహిత్ శర్మ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్‌పై లార్డ్స్ వన్డేలో 138 పరుగులతో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ సూపర్ సెంచరీతో చెలరేగాడు. తాజాగా సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'వన్డే ప్రపంచకప్ జట్టులో రోహిత్ శర్మ ఉండకూడదని అగార్కర్ నిర్ణయించాడని వార్తలు వచ్చాయి. బహుశా అందుకే చీఫ్ సెలెక్టర్‌గా అతని కాంట్రాక్టును పొడిగించలేదేమో. కానీ, వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని రోహిత్ శర్మ పదేపదే నిరూపిస్తున్నాడు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి కూడా.. సెంచరీ బాదేంతసేపు బ్యాటింగ్ చేశాడంటేనే అతని ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రోహిత్ విషయంలో తన వైఖరికి అజిత్ అగార్కర్ కచ్చితంగా పశ్చాత్తాపపడుతుంటాడు" అని రమేశ్ చెప్పుకొచ్చాడు.
ఆరోగ్యకరమైన పోటీ..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోందని రమేశ్ చెప్పుకొచ్చాడు. ఒకరు సెంచరీ చేస్తే, మరొకరు కూడా సెంచరీ చేయడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిందన్నాడు. ఇద్దరూ గాయపడిన పులుల్లా ఆడుతున్నారని కొనియాడాడు. ఇలాంటి ఫ్లాట్ పిచ్‌పై రోహిత్ సెంచరీ చేయడం ఆశ్చర్యం కలిగించలేదని, అతను తీవ్రమైన కసితో బ్యాటింగ్ చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


