అజిత్ అగార్కర్ నోరు మూయించిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో.. ఔట్ ఫీల్డ్‌లో కూడా అంతే చలాకీగా ఉంటాడు. సహచర ఆటగాళ్లు, స్నేహితులతో సరదాగా ఉంటూ తనదైన శైలిలో జోకులు పేల్చుతుంటాడు. అప్పుడప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా రోహిత్ శర్మ సైలెంట్‌గా వేసిన కౌంటర్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఉద్దేశించే ఈ కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సెప్టెంబర్ 19 నుంచి సోనీ టీవీ ఛానెల్లో ప్రసారం కానున్న ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ అనే ఎంటర్‌టైన్‌మెంట్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ షోకు సంబంధించిన ప్రోమో షూటింగ్ సమయంలో రోహిత్ శర్మ వైట్ కలర్ టీ షర్ట్ ధరించి కెమెరాతో మాట్లాడాడు. ఆ టీ షర్ట్‌పై కమిట్‌మెంట్ లేదా? అని రాసి ఉంది. నోటితో ఏమీ అనకపోయినా ఈ కోట్‌తో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను రోహిత్ టార్గెట్ చేశాడని అతని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

గతేడాది అక్టోబర్‌లో శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడే విషయంలో కమిట్మెంట్‌తో లేరని అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలకు రోహిత్ శర్మ ఓ కౌంటర్ ఇచ్చాడు. దేశం తరఫున ట్రోఫీలు గెలవాలనే కమిట్మెంట్, ఆకలి పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశాడు. తాజాగా అజిత్ అగార్కర్ ఉపయోగించిన నాన్ కమిటల్ అనే పదాన్నే టీ షర్ట్‌పై ముద్రించుకుని రోహిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతున్నాడని జోరుగా ప్రచారం జరగ్గా బీసీసీఐ గట్టిగా కౌంటరిచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ జట్టులోనే కొనసాగుతాడని స్పష్టం చేసింది. మరోవైపు సెలెక్టర్లు రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకోవాలని సూచించారని, ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి వన్డేనే అతనికి చివరిదని వార్తలు వచ్చాయి. కానీ ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ భారీ శతకంతో చెలరేగి విమర్శుకులకు తనదైన శైలిలో బదులిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


