అజిత్ అగార్కర్‌పై వేటుకు ఆ ఇద్దరే కారణం!
భారత సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్ అజిత్ అగార్కర్‌పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమైంది. గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ ఫైనల్స్ చేరి, మూడు ట్రోఫీలు అందించిన ఘనమైన రికార్డ్ అజిత్ అగార్కర్ ఉన్నప్పటికీ.. అతన్ని కొనసాగించే ఉద్దేశం బీసీసీఐకి లేనట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సీఓఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో తలెత్తిన విభేదాలే అజిత్ అగార్కర్ పోస్ట్‌కు ఎసరు తెచ్చాయనే వాదన వినిపిస్తోంది.
రోహిత్‌ను తప్పించాలనుకోవడం..
2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను తప్పించాలని అగార్కర్ ప్రయత్నించడం అతని కొంపముంచిందని వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మకు బదులుగా యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని అగార్కర్ భావించాడు. టీమ్ హెడ్ కోచ్, ఇతర సెలెక్టర్లతో కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సౌత్ జోన్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా సాయంతో రోహిత్ శర్మకు చెప్పించాడట.
2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ.. అగార్కర్ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, వెంటనే బోర్డులోని ఒక పవర్‌ఫుల్ అడ్మినిస్ట్రేటర్‌ను కలిసి సెలెక్టర్ల తీరుపై ఫిర్యాదు చేశాడని పేరు చెప్పడానికి ఇష్టపడి ఓ బోర్డు మెంబర్ పీటీఐకి తెలిపాడు.

ఈ విషయంలో బోర్డు రోహిత్ శర్మకు అండగా నిలిచింది. అగార్కర్‌తో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను ఖండిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇది అగర్కార్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. చీఫ్ సెలెక్టర్‌గా తనను సంప్రదించకుండానే ప్రకటనను విడుదల చేయడం తనను అవమానించడమేనని అజిత్ అగార్కర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ క్షణమే చీఫ్ సెలెక్టర్‌గా తాను కొనసాగలేనని, పెద్ద ప్లేయర్లను తొలగించే అధికారం తనకు లేదని అగార్కర్ గ్రహించడని సదరు అధికారి పేర్కొన్నాడు.
లక్ష్మణ్‌తో విభేదాలు..
సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో తలెత్తిన విభేదాలు కూడా అగార్కర్ పదవిని కోల్పోయేలా చేశాయి. ఆసియా గేమ్స్‌కు పంపే జట్టు విషయంలో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ అత్యుత్తమ జట్టును పంపించాలని కోరగా.. ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని అగార్కర్ వాగ్వాదానికి దిగాడంట.
అంతేకాకుండా ఇరానీ కప్, ఇండియా-ఏ మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకేసారి రావడంపై కూడా లక్ష్మణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆటగాళ్ల గాయాల గురించి తరుచూ మీడియాకు లీక్ ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగేలా చేసిందని తెలుస్తోంది.
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాజయాలపై ముంబై వేదికగా నిర్వహించిన బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ హాజరు కాకపోవడం బోర్డు సభ్యులకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. సెక్రటరీ దేవజిత్ సైకియా అగార్కర్‌ను వెనకేసుకొచ్చినా.. మెజార్టీ సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం.
ఈ వరుస ఘటనల నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ వ్యవహారం బోర్డు చేతుల్లో ఉంటుందని, చీఫ్ సెలెక్టర్లు నిర్ణయించలేరనే విషయాన్ని ఈ ఘటన ద్వారా తెలియజేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


