Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే భారత్ గెలిచేది: అశ్విన్

శ్రీలంకతో రెండో టెస్ట్‌‌ను టీమిండియా డ్రా చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించేదని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తుది జట్టు నుంచి కుల్దీప్ యాదవ్‌ను తప్పించి టీమిండియా మేనేజ్‌మెంట్ మూల్యం చెల్లించుకుందని విమర్శించాడు.

ఈ మ్యాచ్ కుల్దీప్ యాదవ్ ఆడి ఉంటే.. తన గూగ్లీ, లెగ్ బ్రేక్‌లతో టెయిలండర్లను ఔట్ చేసేవాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు రోజుల పాటు ఆధిపత్యం చెలాయించిన భారత్..తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరి రోజు ఆటలో శ్రీలంక చివరి నాలుగు వికెట్లను తీయలేక మూల్యం చెల్లించుకుంది.

శుభ్‌మన్ గిల్ వల్లే కుల్దీప్ యాదవ్ విఫలమయ్యాడు: అశ్విన్

శుభ్‌మన్ గిల్ వల్లే కుల్దీప్ యాదవ్ విఫలమయ్యాడు: అశ్విన్

కుల్దీప్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసారు..

ఈ ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. కుల్దీప్ యాదవ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నాడు. 'చాలా మంది కుల్దీప్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నారు. కానీ అదే సమయంలో కొందరు అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో అతనేం సాధించాడు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం.

R Ashwin Says India Would Have Beaten Sri Lanka Easily If Kuldeep Yadav Had Played in Colombo Test

ఒక ఆటగాడి కోణంలో చూస్తే.. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ ఆత్మవిశ్వాసం మరింత సన్నగిల్లి ఉంటుంది. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లి వెతికినా కనిపించని స్థాయిలో అతను ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. 60-80 ఓవర్ల మధ్య జడేజా ఎక్కువగా బౌలింగ్ చేస్తాడు. ఆ సమయంలో పరుగులు చేయడం కష్టమని జడేజాతో బౌలింగ్ చేయిస్తారని చెబుతారు. కానీ ఓ స్పిన్నర్‌కు అక్కడ బౌలింగ్ చేయడం కూడా చాలా కష్టమైన విషయమే. కనీసం ఒక అదనపు స్పెల్ కూడా కుల్దీప్ యాదవ్‌కు ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం.

IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!

Also Read

IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!

తన బౌలింగ్‌తో ఎక్స్‌ఫ్యాక్టర్ అయ్యేవాడు..

దినూషాతో కలిసి టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, కుల్‌దీప్ యాదవ్ ఉండి ఉంటే.. గూగ్లీ, లెగ్‌ బ్రేక్‌లతో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఎక్స్‌ ఫ్యాక్టర్ అయ్యేవాడు. కానీ అతను చేసిన తప్పు ఏంటో? అతన్ని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదో అర్థం కావడం లేదు. అతన్ని చూస్తే నాకా చాలా బాధగా ఉంది.

తదుపరి సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌ను కచ్చితంగా ఆడిస్తారు. కానీ రెండు తప్పులు ఒకదానితో ఒప్పుగా మారవు. తొలి టెస్ట్‌కు.. రెండో టెస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదు. అప్పటికే తొలి టెస్ట్ గెలిచారు కాబట్టి అతనికి మద్దతు ఇచ్చి ఉండాల్సింది. నేను దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 28, 2026, 13:53 [IST]
Other articles published on Aug 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+