IND vs SL: కోహ్లీ ఉంటే కథ వేరే ఉండేది బాస్: మాజీ క్రికెటర్
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. కోహ్లీ తన దూకుడైన స్వభావంతో ఆటగాళ్లను ఉత్తేజరిచేవాడని తెలిపాడు.
కొలంబో వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో సోనాల్ దినుషా అజేయ శతకంతో శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కిన సంగతి తెలిసిందే. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను భారత్ చేజేతులా డ్రా చేసుకుంది. ఆఖరి రోజు ఆటలో నలుగురు బ్యాటర్లను ఔట్ చేయలేక మూల్యం చెల్లించుకుంది.
కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..
ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. కోహ్లీ ఉండి ఉంటే అతను అరుస్తూ ఆటగాళ్లను అప్రమత్తం చేసేవాడని చెప్పుకొచ్చాడు.'టెస్ట్ క్రికెట్ ఆడటం అందరికీ చాయ్ తాగినంత ఈజీ కాదు బాస్. ఇది చాలా సుదీర్ఘమైన ఆట. ఈ ఫార్మాట్‌లో నిరంతరం బౌలింగ్ చేస్తూనే ఉండాలి.

ఒకవేళ ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడి ఉంటే.. అతను నిరంతరం అరుస్తూ జట్టును అప్రమత్తంగా ఉంచేవాడని నాకు అనిపించింది. కొన్ని సందర్భాల్లో మనం 'బౌలింగ్ చేస్తూ ఉంటే చాలు.. అదే జరుగుతుంది. బంతి చాలా టర్న్ అవుతోంది. దానంతట అదే వికెట్ పడుతుందిలే' అని అనుకుంటూ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకున్నామేమో అనిపించింది.
కోహ్లీ ఉత్సాహపరిచేవాడు..
భారత్ స్వయంగా సృష్టించుకున్న అవకాశాలు చాలా తక్కువ. మన ఆటగాళ్ల ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. అందుకే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను 'కమాన్ సర్ఫరాజ్, కమాన్ జైస్వాల్' అంటూ ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపేవాడు. అలాగే సోనాల్ దినూషాను కూడా వదిలేవాడు కాదు. తన స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టేవాడు. కానీ భారత్ ఆటగాళ్లు లాహిరు కుమారతో ఘర్షణకు దిగారు.'అని కైఫ్ అసహనం వ్యక్తం చేశాడు.
దినూషాను డీకోడ్ చేయలేక..
సోనాల్ దినూషాను డీకోడ్ చేయడంలో భారత జట్టు పూర్తిగా విఫలమైందని కైఫ్ మండిపడ్డాడు. కవర్ డ్రైవ్ ఆడటంలో అతనికి ఇబ్బంది ఉన్నా.. ఆ దిశగా టీమిండియా బౌలింగ్ వ్యూహాలు కనిపించలేదన్నాడు. 'ప్రతీ బ్యాటర్‌కు ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని కనుగొనడంలో భారత్ విఫలమైంది. నేను కేవలం శుభ్‌మన్ గిల్‌ను మాత్రమే నిందించడం లేదు. సోనాల్ దినుషా బలహీనతను పసిగట్టడంలో బౌలింగ్ విభాగంతో పాటు కోచింగ్ సిబ్బంది దారుణంగా విఫలమైంది.
అతనికి ఒక్క డ్రైవ్ షాట్ బాల్ కూడా వేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత డ్రైవ్ బాల్‌తోనే సోనాల్ దినూషాను సారాన్ష్ జైన్ ఔట్ చేశాడు. కానీ ఈ విషయాన్ని భారత బౌలర్లు మరిచిపోయారు. మహమ్మద్ సిరాజ్ ఫుల్ బాల్ వేసినా అతను తెలివిగా వదిలేసాడు. అతను షాట్లు ఆడటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. దినూషాను లైట్ తీసుకోవడంతోనే విజయం చేజారింది'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

