Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: ఓర్నీ.. ఇదేం సెలెబ్రేషన్ రా అయ్యా!(వీడియో)

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వికెట్ పడిన ఆనందంలో సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రిట్జ్‌కే చేసుకున్న సెలెబ్రేషన్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గాల్లో తేలుతూ పిచ్ ఈ కొన నుంచి అవతలికి దూకుతూ బ్రిట్జ్‌కే చేసేకున్న సంబరాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఓర్నీ.. ఇదేం సెలెబ్రేషన్ రా అయ్యా!అని ఒకరంటే.. నువ్వు పక్షివా? మనిషివా? అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

అతను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ కాదు.. వన్డే జట్టులోకి తీసుకోవాలి: మహమ్మద్ కైఫ్

అతను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ కాదు.. వన్డే జట్టులోకి తీసుకోవాలి: మహమ్మద్ కైఫ్

అసలేం జరిగిందంటే..?

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమన్ హర్మర్ వేసిన ఈ ఓవర్‌ ఆఖరి బంతికి మార్నస్ లబుషేన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో అతను ఒక్క పరుగు చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే బ్రిట్జ్‌కే సంతోషాన్ని తట్టుకోలేక.. పక్షిలా ఈ పిచ్ కొన నుంచి అవతలికి గాల్లో తేలాడు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

SA vs AUS Matthew Breetzke Kangaroo Jump Celebration After Marnus Labuschagne s Wicket Goes Viral

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(111 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(126 బంతుల్లో 4 ఫోర్లతో 51 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మాథ్యూ రేన్ షా(139 బంతుల్లో 10 ఫోర్లతో 74) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకోగా.. ట్రావిస్ హెడ్(49 బంతుల్లో 7 ఫోర్లతో 41) హాఫ్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, సిమన్ హర్మర్ రెండేసి వికెట్లు తీసారు.

సౌతాఫ్రికా 329 ఆలౌట్..

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(141 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 78), మార్క్యూ అకెర్‌మన్(94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95), డేవిడ్ బెడింగ్‌హమ్(80 బంతుల్లో 7 ఫోర్లతో 50), మార్కో జాన్సెన్(71 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!

మిచెల్ స్టార్క్(6/72) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. నాథన్ లయన్(2/71) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌ వుడ్, కూపర్ కనోల్లి చెరో వికెట్ తీసారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఒక పరుగు ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో ఒక్క సెషన్ ఆడినా ఆసీస్ 100 ప్లస్ పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో మ్యాచ్ గెలిచాయి. మూడో టెస్ట్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది.

Story first published: Thursday, October 29, 2026, 9:43 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+