Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఆదుకున్న ధ్రువ్ జురెల్.. భారత్-ఏ భారీ స్కోర్!

న్యూజిలాండ్-ఏతో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత్-ఏ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్లకు 291 పరుగులు చేసింది.

కెప్టెన్ ధ్రువ్ జురెల్(155 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 99 బ్యాటింగ్), దేవదత్ పడిక్కల్(140 బంతుల్లో 12 ఫోర్లతో 80) రాణించారు. న్యూజిలాండ్-ఏ బౌలర్లలో ఫ్రెజర్ షీట్(4/50) నాలుగు వికెట్లు తీయగా.. బ్రెట్ రండెల్, జర్రాడ్ మెక్‌కాయ్, జైడెన్ లెన్నాక్స్ తలో వికెట్ తీసారు.

IND vs NZ: వ్యూహాత్మక మార్పు.. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వ్యూహాత్మక మార్పు.. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

విఫలమైన జైస్వాల్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లోనూ జైస్వాల్ నిరాశపర్చిన సంగతి తెలిసిందే. క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

Dhruv Jurel Unbeaten 99 Powers India A to 291 7 Against New Zealand in 2nd Unofficial Test

ఈ జోడీ తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన యశ్ రాథోడ్(13) నిరాశపర్చగా.. సెంచరీ ముంగిట పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రవిచంద్రన్ స్మరన్(0) గోల్డెన్ డక్ కాగా.. వాషింగ్టన్ సుందర్(8) సైతం ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్

Also Read

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్

దాంతో భారత్ 160 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్‌తో కలిసి ఆదుకున్నాడు. ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం మానవ్ సుతార్ ఔటవ్వగా.. ఆకాశ్ దీప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సెంచరీ ముంగిట నిలిచిన ధ్రువ్ జురెల్ జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. 8వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించాడు.

తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్ తృటిలో విజయాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆఖరి రోజు ఆటలో ఆఖరి వికెట్ ముందు నిలిచిన న్యూజిలాండ్-ఏ బ్యాడ్ లైట్ కారణంగా కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే ఆట ముగియడంతో బచాయించింది.

Story first published: Saturday, October 31, 2026, 16:36 [IST]
Other articles published on Oct 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+