Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: హేజిల్‌వుడ్ సిక్సర్.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం!

సౌతాఫ్రికా‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 214 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మ్యాట్ రెన్‌షా(190, 82,2/30) అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్‌గా టెంబా బవుమాకు ఇదే తొలి పరాజయం.

421 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా 102/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 86.5 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(237 బంతుల్లో 10 ఫోర్లతో 75) ఒంటరి పోరాటం చేయగా.. డేవిడ్ బెడింగ్‌హామ్(46), మార్కో జాన్సెన్(35), వియాన్ మల్డర్(29) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్(6/49) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. మ్యాట్ రేన్‌షా(2/30)రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.

SA vs AUS Josh Hazlewood Stars With Six-Wicket Haul in Australia s Win Over South Africa In 1st Test

మ్యాట్ రేన్‌షా శతకంతో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మ్యాట్ రేన్‌షా(397 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్‌తో 190) అసాధారణ శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్(4/68) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(3/68), అన్రిచ్ నోర్జ్(2/88) రెండు వికెట్లు పడగొట్టాడు. సిమన్ హర్మర్ ఒక వికెట్ తీసాడు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్‌హామ్(49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, నాథన్ లయన్ రెండేసి వికెట్లు తీయగా..ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యూ వెబ్‌స్టర్‌కు ఒక వికెట్ దక్కింది.

ఆసీస్ 314/6 డిక్లేర్డ్..

106 పరుగుల భారీ ఆధిక్యంతో ఆస్ట్రేలియా 58 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగుల వద్ద డిక్లెర్డ్ చేసింది. మరోసారి మ్యాట్ రేన్‌షా(99 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, సిమన్ హార్మర్ తలో వికెట్ పడగొట్టారు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

Also Read

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

సంక్షిప్త స్కోర్లు..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 390 ఆలౌట్(మ్యాట్ రేన్‌షా 190)

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 314/6 డిక్లేర్డ్

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్

Story first published: Tuesday, October 13, 2026, 17:36 [IST]
Other articles published on Oct 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+