Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలుగోడిపై అక్కసు.. ఆల్‌రౌండర్ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు!

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ విమర్శలు గుప్పించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇష్టమైన ఆటగాళ్లకే ఈ జట్టులో చోటు దక్కిందని ఆరోపించాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండరే కాదంటూ విమర్శలు గుప్పించాడు.

అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వగా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన రింకూ సింగ్, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్‌లను సెలెక్టర్లు తప్పించారు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ నలుగురు ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంది.

S Badrinath questions Gambhir-backed T20I selections For Afghanistan T20Is Says I don t rate Nitish Reddy so high

ఈ సెలెక్షన్‌పై బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. 'ఈ జట్టును చూడగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇష్టమైన ఆటగాళ్లు రీఎంట్రీ ఇచ్చారనిపించింది. వాషింగ్టన్ సుందర్‌కు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. అతను వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

నితీష్ కుమార్ కూడా చోటు దక్కించుకున్నాడు. నా దృష్టిలో అతను ఆల్‌రౌండర్ కాదు. అతన్ని గొప్ప బౌలర్‌గా నేను చూడను. నితీష్ రెడ్డి కేవలం బ్యాటర్ మాత్రమే. బౌలింగ్‌లో అతనికి గొప్ప ప్రతిభ ఏం లేదు.

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

Also Read

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ జట్టుకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అతనే స్వయంగా గంభీర్, సెలెక్షన్ కమిటీతో మాట్లాడి తాను ఆడాలనుకుంటున్నానని చెప్పి ఉంటాడు. గాయం కారణంగా గత జూలైలో జరిగిన ఇంగ్లండ్ వన్డే సిరీస్ తర్వాత అతను ఆడలేదు. కాబట్టి సుదీర్ఘ విరామం తర్వాత అతను రీఎంట్రీ ఇవ్వడం మంచి విషయం.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ గెలవకపోవడంతో.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Story first published: Thursday, September 3, 2026, 20:41 [IST]
Other articles published on Sep 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+