తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్లలో ఇదే తొలిసారి.!
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 తుది దశకు చేరింది. సెప్టెంబర్ 6(ఆదివారం) నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్.. తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్సీ ఆప్షన్స్‌గా భావిస్తున్న తరుణంలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇలా ప్రతిష్టాత్మక దేశవాళీ టైటిల్ కోసం పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో ఈ మ్యాచ్‌కు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టి వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా కెప్టెన్సీ ఎగరేసుకుపోతాడా? అనే చర్చ జరుగుతోంది.
54 ఏళ్ల తర్వాత..
54 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లు దులీప్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి మాత్రం. చివరి సారిగా 1970-71 సీజన్‌లో ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఓవరాల్‌గా సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరడం ఇది 24వ సారి. ఇప్పటి వరకు సౌత్ జోన్ 13 టైటిళ్లు గెలిచింది. మరోవైపు 13 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన ఈస్ట్ జోన్.. చివరి సారిగా 2012-13 సీజన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు 8 సార్లు ఫైనల్ చేరిన ఈస్ట్ జోన్ రెండు టైటిళ్లు మాత్రమే గెలిచింది.
సూపర్ ఫామ్‌లో వైభవ్
సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఇషాన్ కిషన్ గైర్హాజరీలో వైభవ్ సూర్యవంశీ జట్టును కూడా నడిపించాడు. అంతేకాకుండా తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు బాదిన వైభవ్ సూర్యవంశీ(92) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
క్లాస్ X మాస్ పోరు..
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పరిస్థితుల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈస్ట్ జోన్ విజయాన్ని సునాయసం చేశాడు. 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి మరోసారి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు నార్త్ జోన్‌తో జరిగిన సెమీఫైన్-2లో తిలక్ వర్మ(116 నాటౌట్, 51 నాటౌట్) అజేయ బ్యాటింగ్ ప్రదర్శనతో ఒంటి చేత్తో సౌత్ జోన్‌ను గెలిపించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో చెలరేగిన తిలక్ వర్మ.. రెండో ఇన్నింగ్స్ అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ X తిలక్ వర్మ పోరును చూసేందుకు అభిమానులు ఆసక్తికనబరుస్తున్నారు. క్లాస్, మాస్ బ్యాటింగ్ మధ్య పోరుగా అభివర్ణిస్తున్నారు.
స్పిన్ వికెట్‌లో..
చెన్నై వేదికగా ఫైనల్ జరుగుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. చెపాక్ పిచ్ సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. వైభవ్ తన దూకుడు కొనసాగిస్తాడా? లేక కండిషన్స్‌కు తగ్గట్లు ఆడుతాడా? అనేది చూడాలి. మరోవైపు తిలక్ వర్మ తన క్లాస్ బ్యాటింగ్‌తో జోరు కనబర్చే అవకాశం ఉంది.
ఎలా చూడాలంటే..?
భారత దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు స్టార్ స్పోర్ట్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

