Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026 ఫైనల్లో భారత్ X పాకిస్థాన్..?

ఆసియా గేమ్స్ 2026లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్ చేరిన భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. సోమవారం జరగాల్సిన హాంగ్ కాంగ్ X పాకిస్థాన్, భారత్ X అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మంగళవారం జరగాల్సిన నేపాల్ X శ్రీలంక, బంగ్లాదేశ్ X మలేసియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా జరగలేదు. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయాయి.

దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో ఉన్న భారత్, పాకిస్థాన్‌లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. అఫ్గాన్, హాంగ్ కాంగ్, నేపాల్, మలేషియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గురువారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్ X పాకిస్థాన్, భారత్ X శ్రీలంక‌లు తలపడనున్నాయి. ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్లు అక్టోబర్ 3న జరిగే ఫైనల్లో తలపడుతాయి. ఓడిన జట్లు అదే రోజు మూడో స్థానం కోసం పోటీపడుతాయి.

విండీస్‌పై విరాట్ ఊచకోత.. కానీ కోచ్ గంభీర్ రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

విండీస్‌పై విరాట్ ఊచకోత.. కానీ కోచ్ గంభీర్ రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Asian Games 2026 India vs Pakistan Final Clash Possible After Quarter-Finals Are Washed Out

భారత్ X పాక్ బిగ్ మ్యాచ్ లోడింగ్..

సెమీఫైనల్లో భారత్, పాకిస్థాన్ విజయం సాధిస్తే.. దాయాదీ దేశాలు ఫైనల్లో తలపడనున్నాయి. ఆసియా కప్ 2025, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడలేదు. ఆసియా గేమ్స్‌ ఫైనల్‌కు ఇరు జట్లు చేరితే.. హైఓల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది. బ్రాడ్‌కాస్టర్‌కు కాసుల వర్షం కురవనుంది. ఈ ఆసియా గేమ్స్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత ప్రథమ శ్రేణి జట్టు బరిలోకి దిగితే.. పాకిస్థాన్ మాత్రం షాహిబ్జాదా ఫర్హాన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టును ఆడిస్తోంది.

అంతా వారి వల్లే.. ఓటమికి కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్

Also Read

అంతా వారి వల్లే.. ఓటమికి కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్

సెమీ ఫైనల్ రద్దయితే..

వర్షం కారణంగా బంగ్లాదేశ్ X పాకిస్థాన్, భారత్ X శ్రీలంక‌ల మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా రద్దయితే.. మెరుగైన ర్యాంకులు కలిగిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఈ లెక్కన భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 6వ, శ్రీలంక 9వ స్థానంలో ఉంది.

ఫైనల్ కూడా రద్దయితే మెరుగైన ర్యాంక్ కలిగిన జట్టుకు గోల్డ్ మెడల్ వరిస్తోంది. కాంస్య పోరు కూడా జరగకపోతే.. అందులో మెరుగైన జట్టుకు మెడల్ దక్కుతుంది. అయితే కనీసం 5 ఓవర్ల ఆటను అయినా ఆడించేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు. అది సాధ్యం కానప్పుడే సీడింగ్ ర్యాంకుల ద్వారా విజేతను ప్రకటిస్తారు.

Story first published: Tuesday, September 29, 2026, 9:30 [IST]
Other articles published on Sep 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+