Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్ సింగ్ ఓ హెడ్ మాస్టర్.. కెరీర్ ఆరంభంలో మమ్మల్ని తిట్టేవాడు: రోహిత్ శర్మ

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ హెడ్ మాస్టర్‌లా వ్యవహరించేవాడని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కెరీర్ ఆరంభంలో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లను బాగా తిట్టేవాడని, అదే సమయంలో అంతే ప్రేమ చూపించేవాడని గుర్తు చేసుకున్నాడు. సోనీ నెట్‌వర్క్‌లో తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' షోలో..ఈ విషయాలను వెల్లడించాడు.

బాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణ అభిషేక్.. తన సహచర ఆటగాళ్లు క్రికెటర్లు కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకునేవారని రోహిత్ శర్మను ప్రశ్నించాడు. వారి వ్యక్తిత్వాల ఆధారంగా ప్రొఫెషన్స్‌ను ఊహించాలని హిట్ మ్యాన్‌ను కోరాడు. జస్‌ప్రీత్ బుమ్రా డాక్టర్ అయ్యేవాడని చెప్పిన రోహిత్.. యువరాజ్ సింగ్‌ను హెడ్ మాస్టర్‌గా.. రిషభ్ పంత్‌ను బేబీ సిట్టర్‌గా పేర్కొన్నాడు.

IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!

IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!

బుమ్రా డాక్టరయ్యేవాడేమో..

'జస్‌ప్రీత్ బుమ్రా గనక క్రికెటర్ కాకపోయుంటే ఖచ్చితంగా డాక్టర్ అయ్యేవాడేమో. ఎందుకంటే అతను మ్యాచ్ చివర్లో వచ్చి జట్టును, దేశాన్ని కాపాడుతుంటాడు. ఆ డెత్ ఓవర్లలో చావు నుంచి కాపాడే డాక్టర్‌లాగా అందరినీ బతికిస్తుంటాడు. ఆ పని అందరికి సాధ్యం కాదు.

Rohit Sharma Reveals How Yuvraj Singh Scolded Young Cricketers in 2006 Shares Rishabh Pant Story

యురాజ్ సింగ్ హెడ్ మాస్టర్..

యువరాజ్ సింగ్‌ను నేను హెడ్‌మాస్టర్ అంటాను. ఎందుకంటే ఆయన హెడ్ మాస్టర్‌లానే వ్యవహరించేవాడు. ఇప్పుడు అలా లేకపోవచ్చు కానీ.. మేం 2006 లేదా 2007‌లో జట్టులోకి కొత్తగా వచ్చినప్పుడు కుర్రాళ్లను బాగా తిట్టేవాడు. అలా తిడుతూనే ఎంతో ప్రేమను కూడా చూపేవాడు.

మొదటి లేదా రెండవ టూర్ తర్వాత, ఆయన నన్ను చాలా కంఫర్టబుల్‌గా ఉండేలా చూశాడు. అలాంటి సీనియర్లతో కలిసి ఆడుతున్నప్పుడు ఆరంభంలో కాస్త భయం, బెరుకు ఉండటం సహజమే. ఆ భయాన్ని ఆయన మెల్లమెల్లగా పోగొట్టాడు. అందుకు కొంచెం సమయం పట్టినా.. ఆ పనైతే చేశాడు.

టాపార్డర్‌లో ఆడటమే ఇష్టం.. లోయారార్డర్‌లో కష్టం: తిలక్ వర్మ

Also Read

టాపార్డర్‌లో ఆడటమే ఇష్టం.. లోయారార్డర్‌లో కష్టం: తిలక్ వర్మ

పిల్లల ఫుడ్ లాక్కుంటాడు..

ఇక రిషభ్ పంత్ మంచి బేబీ సిట్టర్. ఎందుకంటే అతనికి పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. మేం తరచూ రెండు, రెండున్నర నెలల పాటు సుదీర్ఘమైన పర్యటనలకు వెళ్లేవాళ్లం. అక్కడికి మాతో పాటు కుటుంబాలు, పిల్లలు కూడా వచ్చేవాళ్లు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రిషభ్ పంత్ వచ్చి పిల్లలతో ఆడుకునేవాడు. ఇలా రోజూ చేసేవాడు.

అయితే, కొన్నిసార్లు తను పిల్లల ప్లేట్లలో నుంచే లాక్కొని తినేసేవాడు. దాంతో ఆ పిల్లలు బాగా చిరాకుపడేవారు. కానీ పంత్ మాత్రం దాన్ని ఎంతో సరదాగా, ప్రేమగా చేసేవాడు. అతనికి ఒక పేరు కూడా వచ్చింది. మేం ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు.. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న టిమ్ పైన్ రిషభ్‌ను 'బేబీసిట్టర్' అని పిలిచాడు. అతనికి పిల్లలతో ఉండే ఆపేక్షే వేరు, అందుకే పిల్లల్లో అంత పాపులర్ అయ్యాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 15, 2026, 18:05 [IST]
Other articles published on Oct 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+