IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముంబై పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే దక్కాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో ముంబై సారథ్య బాధ్యతలు మళ్లీ రోహిత్ శర్మకే దక్కాయని వార్తలు వచ్చిన కాసేపటికే ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పెట్టి ఓ పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
రోహిత్ శర్మను తప్పించి మరీ హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సమయంలో ముంబై వివరణ ఇచ్చింది. కానీ ఈ నిర్ణయాన్ని అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా స్వాగతించలేకపోయారు. హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. వరుసగా మూడు సీజన్లలో ఒకే సారి ప్లే ఆఫ్స్ చేరింది.

హార్దిక్ కెప్టెన్సీలో ఫ్లాప్ షో..
ఐపీఎల్ 2024 సీజన్లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2025 సీజన్లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరినా.. క్వాలిఫయర్-2లో ఓడి ఇంటిబాట పట్టింది. ఐపీఎల్ 2026 సీజన్లో 9వ స్థానంలో నిలిచింది. ఈ ఘోర పరాజయాల నేపథ్యంలో ముంబై జట్టును వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి.
మరోవైపు ముంబై ఫ్రాంచైజీ సైతం హార్దిక్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై కెప్టెన్‌గా తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ అంటూ వార్తలు వినిపించినా.. తదుపరి మెగా వేలం వరకు రోహిత్ శర్మనే సారథిగా కొనసాగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రోహిత్.. ముంబై కింగ్
ఇందుకు తగ్గట్లుగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హిట్‌మ్యాన్‌కే కెప్టెన్ అంటూ ఓ హింట్ ఇచ్చింది. ముంబై షేర్ చేసిన పోస్ట్‌లో రోహిత్ శర్మను కింగ్ ఆఫ్ ది ఫ్రాంచైజీగా పేర్కొంది. బుమ్రాను లయన్గా.. ట్రెంట్ బౌల్ట్‌ను లైంటింగ్గా.., తిలక్ వర్మను స్టార్‌గా.. సూచించింది. దాంతో రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్ అనే విషయాన్ని ఫ్రాంచైజీ తెలియజేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ ది ఫ్రాంచైజీ అంటే అర్థం ఇదేనని అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్లో జరగనుండగా.. రిటెన్షన్ జాబితాలను ప్రకటించేందుకు బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా విధించింది. 10 ఫ్రాంచైజీలు వేలం వ్యూహాలను సిద్దం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ పూర్వ వైభవం అందుకోవాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


