రోహిత్ శర్మ రిటైర్మెంట్? లండన్‌కు కుటుంబ సభ్యులు!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసిందా..? లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే అతనికి చివరి మ్యాచా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై జోరుగా ప్రచారం జరుగుతుంది. పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ ఘనతలను ప్రస్తావిస్తూ కొనియాడటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
అంతేకాకుండా రోహిత్ శర్మ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు లండన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తనను తప్పించడంపై రోహిత్ శర్మ.. బీసీసీఐని సంప్రదించినా ఫలితం లేకపోయిందని సమాచారం. బీసీసీఐ వైఖరి పట్ల రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి కానుంది.

పేలవ ప్రదర్శనతో.
ఇప్పటికే రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన రోహిత్ శర్మ ఏకంగా 10 కిలోల బరువు కూడా తగ్గాడు. కానీ నిలకడగా రాణించలేకపోయాడు.
గత 8 వన్డే మ్యాచ్‌ల్లో 30.1 సగటుతో కేవలం 241 పరుగులే చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ వరుసగా 11, 26 విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తొలగించామని రోహిత్ శర్మకు సెలెక్టర్లు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. భవిష్యత్తును నిర్ణయించుకోవాలని సూచించినట్లు కూడా తెలుస్తోంది.
రవి శాస్త్రి వ్యాఖ్యలతో..
అంతేకాకుండా ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా పక్కన కూర్చున్న రోహిత్ శర్మ చాలా బాధగా కనిపించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రి తన వ్యాఖ్యానంలో రోహిత్ శర్మ ఘనతలను ప్రస్తావించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. 'రోహిత్ శర్మ సుదీర్ఘ కాలంగా అద్భుతంగా ఆడాడు.
భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. తృటిలో వన్డే ప్రపంచకప్ చేజారింది. ఇక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కూడా ఘనత సాధించాడు. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై 2019 వన్డే ప్రపంచకప్‌లో అందుకున్నాడు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ పక్కా..
మరోవైపు తన ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తాడని మాజీ క్రికెటర్ పార్దీవ్ పటేల్ జోస్యం చెప్పాడు. 'రోహిత్ శర్మకు లార్డ్స్ మ్యాచ్ చివరిదైతే సెంచరీతో ఘనంగా ముగిస్తాడు. ఆ సత్తా అతనికి ఉంది. గతంలో ఎన్నోసార్లు అతను ఇబ్బంది పడటం చూశాం. మళ్లీ పుంజుకొని పరుగుల మోత మోగించాడు. లార్డ్స్‌లో కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నా.
రోహిత్ ప్రతీ మ్యాచ్‌లోనూ భారీ పరుగులు చేయడు. ఆడినప్పుడు మాత్రం మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో మంచి ఆరంభమే అందుకున్నా భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. చివరి వన్డేలో సెంచరీతో విమర్శకుల నోటికి తాళం వేస్తాడని అనుకుంటున్నా'అని పార్దీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

