Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రెండో వన్డేలో భారత్ ఓటమి!

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. కార్డిఫ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. జో రూట్(133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(66 బంతుల్లో 8 ఫోర్లతో 65), శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ (30 బంతుల్లో 6 ఫోర్లతో 31), జస్‌ప్రీత్ బుమ్రా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(3/50), జోఫ్రా ఆర్చర్(3/47)లతో పాటు.. సకీబ్ మహ్మూద్(2/52) రెండు వికెట్లు తీసాడు. విల్ జాక్స్‌, సామ్ కరణ్ తలో వికెట్ పడగొట్టారు.

IND vs ENG Joe Root Unbeaten 99 Guides England to Four-Wicket Victory Over India in 2nd ODI

అనంతరం ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జో రూట్‌తో పాటు విల్ జాక్స్(44 బంతుల్లో 2 ఫోర్లతో 30), సామ్ కరణ్(31 బంతుల్లో 4 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్(2/67) రెండు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. చివరిదైన మూడో వన్డే ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరగనుంది.

జోరూట్ ఒక్కడే..

234 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే బెన్ డకెట్‌టు బుమ్రా గోల్డెన్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్ జాకోబ్ బెతె‌ల్(4)ను ప్రసిధ్ కృష్ణ మూడో ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. జోరూట్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన హ్యారీ బ్రూక్(16)ను గుర్నూర్ బ్రార్, సామ్ కరణ్(26)ను శివమ్ దూబే ఔట్ చేవాడు. జోస్ బట్లర్(17)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు.

మలుపు తిప్పిన భాగస్వామ్యం..

కానీ ఓవైపు వికెట్లు పడినా మరోవైపు జోరూట్ అడ్డుగోడలా నిలబడ్డాడు. చేధించాల్సిన లక్ష్యం చిన్నదే కావడంతో చింత లేకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ నిలిచాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నారు. విల్ జాక్స్‌ను గుర్నూర్ బ్రార్ ఔట్ చేసినా.. గస్ అట్కిన్సన్(23 నాటౌట్) సాయంతో జోరూట్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. చివర్లో అట్కిన్సన్ 6, 4 తో దూకుడుగా ఆడటంతో జోరూట్ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

Story first published: Friday, July 17, 2026, 7:07 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+