IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 53 ఏళ్లలో ఇదే తొలిసారి!
వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. 53 ఏళ్ల తమ వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 400+ స్కోర్ చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 405/7 స్కోర్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే వెస్టిండీస్‌కు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
జాన్ క్యాంబెల్(68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101), కెప్టెన్ షై హోప్(94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104), అమీర్ జంగూ(77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114) శతకాలతో చెలరేగడంతో విండీస్ ఈ భారీ స్కోర్ నమోదు చేసింది. అంతేకాకుండా వెస్టిండీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతకాలు సాధించడం కూడా ఇదే తొలిసారి. 2019లో ఇంగ్లండ్‌పై సెయింట్ జార్జ్ వేదికగా చేసిన 389 పరుగులే వెస్టిండీస్‌కు హయ్యెస్ట్ స్కోర్‌గా ఉండగా.. గౌహతి మ్యాచ్‌లో ఈ రికార్డ్‌ను అధిగమించింది.

వన్డేల్లో వెస్టిండీస్ అత్యధిక స్కోర్లు..
405/7* vs భారత్, గౌహతి 2026
389 vs ఇంగ్లండ్, సెయింట్ జార్జ్ 2019
385/7 vs ఐర్లాండ్, డబ్లీన్ 2025
381/3 vs ఐర్లాండ్, డబ్లీన్ 2019
374/6 vs నెదర్లాండ్, హరారే 2023
భారత్‌పై అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్ల జాబితాలో విండీస్ చేరింది. భారత్‌పై మూడో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 2015లో వాంఖడే వేదికగా సౌతాఫ్రికా నమోదు చేసిన 438/4 పరుగులు హయ్యెస్ట్ స్కోర్‌గా కొనసాగుతోంది.
భారత్‌పై అత్యధిక వన్డే స్కోర్లు
438/4 సౌతాఫ్రికా, వాంఖడే 2015
411/8 శ్రీలంక, రాజ్‌కోట్ 2009
405/7 వెస్టిండీస్, గౌహతి 2026*
389/4 ఆస్ట్రేలియా, సిడ్నీ 2020
387/3 ఇంగ్లండ్, లార్డ్స్ 2026
తేలిపోయిన భారత బౌలర్లు..
వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసంతో భారత బౌలర్లు తేలిపోయారు. అరంగేట్ర పేసర్ అకీబ్ నబీ 8.5 ఓవర్లలో 84 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 2 వికెట్లు తీసినప్పటికీ 96 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ 5 ఓవర్లలోనే 45 పరుగులిచ్చుకోగా.. జడేజా, కుల్దీప్ యాదవ్ పూర్తి కోటా బౌలింగ్ చేసి 75, 65 పరుగులు ఇచ్చుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


