Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ కీలక సమావేశం.. తేలిపోనున్న రోహిత్ భవితవ్యం!

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అత్యున్నత స్థాయి సమావేశానికి సిద్దమైంది. గురువారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో ఈ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఐర్లాండ్, ఇంగ్లండ్, శ్రీలంక పర్యటనల్లో భారత జట్టు ప్రదర్శనపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాజరుకానున్నారు. టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వర్చువల్‌గా పాల్గొననున్నాడు.

IPL 2027: రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కీలక బాధ్యతలు..!

IPL 2027: రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కీలక బాధ్యతలు..!

యూకే పర్యటన వైఫల్యాలపై

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజయానంతరం.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత్ జట్టు దారుణంగా విఫలమైంది. వరుసగా 6 టీ20 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ ఫలితాలపై బీసీసీఐ అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసింది.

Rohit Sharma Future Could Be Discussed at BCCI High-Level Review Meeting in Mumbai

ఈ వైఫల్యాలపై ఖచ్చితంగా సమీక్ష చేస్తామని సెక్రటరీ దేవజిత్ సైకియా అప్పట్లోనే మీడియాకు తెలిపారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు.భారత జట్టు ప్రదర్శనతో పాటు భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తేలిపోనున్న రోహిత్ భవితవ్యం..

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై బీసీసీఐ, సెలెక్షన్ కమిటీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. వన్డే ప్రపంచకప్ 2027 వనకు రోహిత్ శర్మ జట్టులో కొనసాగడం కష్టమని వార్తలు వచ్చాయి. రోహిత్ రిటైర్మెంట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీసీసీఐ ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ భవితవ్యంపై కూడా ఈ సమావేశంలో చర్చించినున్నట్లు తెలుస్తోంది. జట్టులో కొనసాగించాలా? వద్దా? అనేదానిపై బీసీసీఐ, మేనేజ్‌మెంట్ ఏకాభిప్రాయానికి రానుంది. ఈ సమావేశం అనంతరం రోహిత్ భవితవ్యంపై స్పష్టత రానుంది.

టీవీ యాంకర్‌గా రోహిత్ శర్మ.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ!

Also Read

టీవీ యాంకర్‌గా రోహిత్ శర్మ.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ!

న్యూజిలాండ్ టూర్‌పై..

అప్‌కమింగ్ న్యూజిలాండ్ పర్యటనలో అనుసరించాల్సి వ్యూహాలపై కూడా చర్చ జరగనుంది. అంతేకాకుండా జట్టు వేధిస్తున్న ఆటగాళ్ల గాయాల బెడద గురించి సుదీర్ఘంగా చర్చింనున్నారు. ముఖ్యంగా సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను వివరణ కోరనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడగింపుతో పాటు, భారత జట్టు నిర్వహణలో వీవీఎస్ లక్ష్మణ్‌కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 18న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కంటే ముందే ఈ ఉన్నత స్థాయి భేటీ జరుగుతుండటంతో.. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు భారత క్రికెట్ భవిష్యత్తును నిర్దేశిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story first published: Wednesday, September 2, 2026, 17:52 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+