Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కీలక బాధ్యతలు..!

ఐపీఎల్ 2027 సీజన్‌ నేపథ్యంలో రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ముంబై నయా సారథిని ఎంపిక చేసే బాధ్యతను రోహిత్‌ శర్మకు అప్పగించినట్లు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో కెప్టెన్‌‌ను మార్చాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని రోహిత్ శర్మను కోరగా.. అందుకు అతను నిరాకరించినట్లు తెలుస్తోంది.

IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం!

IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం!

దాంతో కెప్టెన్సీని నిర్ణయించే వ్యూహ బృందంలో ముంబై మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను చేర్చిందట. మూడేళ్ల క్రితం రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. జట్టు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా.. అభిమానులు ఒప్పుకోలేదు.

IPL 2027 Rohit Sharma to Pick Mumbai Indians Next Captain Hardik Pandya to Continue as Player Report

రోహిత్ శర్మ జట్టును వీడుతాడని కూడా ప్రచారం జరిగింది. కానీ అతను మాత్రం జట్టుతోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినా ఆటగాడిగా సర్దుకుపోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా వరుసగా మూడేళ్లూ సారథిగా పేలవ ప్రదర్శన చేశాడు. గతేడాది ముంబై ఆట తీరు మరీ తీసికట్టుగా తయారవడంతో అతన్ని పక్కన పెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది.

హార్దిక్ పాండ్యా వేరే ఫ్రాంచైజీకి వెళ్తాడని, ఈ మేరకు వివిధ జట్లతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లాంటి జట్లు హార్దిక్ కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సరైన ఒప్పందాలు రాకపోవడం, హార్దిక్ బదులుగా తాము కోరుకున్న ఆటగాళ్లను ఇతర ఫ్రాంచైజీలు ఇవ్వకపోవడంతో ఈ ట్రేడ్ డీల్స్ ముందుకు సాగలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా కేవలం ఆటగాడిగా ముంబై ఇండియన్స్ మరో సీజన్ కొనసాగే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాల పేర్లను పరిశీలిస్తున్నారట.

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?

Also Read

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?

సూర్యకుమార్ యాదవ్ వయసు మీదపడడం, ఫామ్ కూడా బాగా లేకపోవడంతో అతన్ని కెప్టెన్సీకి పరిగణించట్లేదు. ఆట దెబ్బ తిన్నప్పటికి తర్వాతి సీజన్‌కు సూర్యను ముంబై అట్టిపెట్టుకోనుందట. జస్‌ప్రీత్ బుమ్రా గాయాల చరిత్ర నేపథ్యంలో.. తిలక్ వర్మకే సారథ్య బాధ్యతలు దక్కలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ శర్మకు కూడా అతను చాలా క్లోజ్‌గా ఉంటాడు.

Story first published: Wednesday, September 2, 2026, 10:27 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+