టీవీ యాంకర్‌గా రోహిత్ శర్మ.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి'అనే పెద్దల మాటను టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనుసరిస్తున్నాడు. క్రేజ్ ఉన్నప్పుడే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని భావిస్తున్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. మరో ఏడాది వ్యవధిలో క్రికెటర్‌గా రోహిత్ ప్రయాణం ముగియనుంది.
ఆ తర్వాత ఏం చేయాలనే విషయంపై రోహిత్ శర్మ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతూనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రోహిత్ శర్మ సిద్దమయ్యాడు. మైదానంలో బ్యాటర్‌గా తనదైన సిక్స్‌లతో అభిమానులను అలరించిన రోహిత్ ఇప్పుడు.. టీవీలో మైక్ పట్టుకోని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్దమయ్యాడు. టీవీ యాంకర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.

హిట్‌మాన్ టాక్ షో..
రోహిత్ హోస్ట్‌గా సోనీ టీవీ ఛానెల్‌లో ఓ ప్రోగ్రామ్ మొదలు కానుంది. ఈ విషయాన్ని సోనీ నెట్ వర్కే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఎంటర్‌టైన్‌మెంట్ కా హిట్ మాన్ జాల్డ్ ఆరా హై'అనే పోస్టర్‌ను విడుదల చేసింది. సోనీ నెట్ వర్క్ ఇండియా సీఈఓ గౌరవ్ బెనర్జీ కూడా ఈ టాక్ షోను ధ్రువీకరించారు.
'భారత క్రికెటర్ రోహిత్ శర్మతో ఓ టీవీ షోను నిర్వహించబోతున్నాం. సోనీ టీవీ, సోనీ లివ్‌లో ప్రసారమయ్యే ఈ షోలో రోహిత్ శర్మ ప్రజెంటర్‌గా యాంకరింగ్ చేయనున్నాడు. ఇది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.'అని గౌరవ్ బెనర్జీ వెల్లడించారు.
వైరల్‌గా ప్రోమో..
ఈ షోకు సంబంధించి సోనీ నెట్ వర్క్ ప్రోమో విడుదల చేసింది. నిమిషానికి పైగా ఉన్న ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రోమోలో అభిమానులు రోహిత్‌ను చుట్టుముట్టి విసుగు తెప్పిస్తారు. మైదానంలో రోహిత్ శర్మ చేసిన ఐకానిక్ డైలాగ్ "కోయీ భీ గార్డెన్ మే నహీ ఘూమేగా" (ఎవరూ గార్డెన్‌లో తిరగకూడదు)ను మళ్లీ మళ్లీ చెప్పాలని కోరుతారు. అభిమానులు పట్టుబట్టడంతో విసుగు చెందిన హిట్ మ్యాన్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతున్నట్లు సరదాగా ఈ ప్రోమోను చిత్రీకరించారు.
ఇటీవలే రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ వార్తలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫమవ్వగానే రోహిత్ శర్మ రిటైర్ అవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. జట్టు నుంచి తప్పిస్తామని సెలెక్షన్ కమిటీ సమాచారమిచ్చిందని ప్రచారం జరిగింది. చివరకు బీసీసీఐ మీడియా ముందుకు వచ్చినా ఈ వార్తలు ఆగలేదు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భారీ శతకంతో చెలరేగిన రోహిత్.. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

