Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా పనైపోలేదు.. 2027 ప్రపంచకప్ కోసం సిద్దంగా ఉన్నా: రోహిత్ శర్మ

భారత క్రికెటర్‌గా తన పని ఇంకా పూర్తికాలేదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పిన హిట్ మ్యాన్ ఈ మెగా టోర్నీ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు.

అంతర్జాతీయ టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ అందుకు తగ్గట్లుగానే ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. 10 కిలోల బరువు తగ్గాడు. తన రిటైర్మెంట్ వార్తలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు.

Asian Games 2026: జపాన్ ఔట్.. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ ఢీ!

Asian Games 2026: జపాన్ ఔట్.. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ ఢీ!

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో రోహిత్ శర్మ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన రోహిత్.. 2027 ప్రపంచకప్ ప్రణాళికలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Rohit Sharma Eyes 2027 World Cup as He Reveals Unfinished Business in ODIs Amid Future Speculation

నా పని పూర్తి కాలేదు..

'భారత క్రికెటర్‌గా నా పని ఇంకా పూర్తి కాలేదు. నేను సాధించాల్సింది ఏం లేదనే ఆలోచన కూడా నా మనసులోకి ఎప్పటికీ రాదు. జట్టుకు ఆడుతున్నంత కాలం సాధించాల్సింది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ప్రస్తుతం నేను రాబోయే 2027 వరల్డ్ కప్ కోసం.. నా ముందున్న లక్ష్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మనం ఐసీసీ ప్రపంచకప్ కప్‌లో ఆడుతున్నప్పుడు ఎదురయ్యే సవాలు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే విభిన్నమైన ప్రత్యర్థులతో.. వేర్వేరు వేదికల్లో ఆడాల్సి వస్తుంది. కాబట్టి ప్రణాళికలు, ఆలోచనా విధానం కూడా భిన్నంగా ఉండాలి. అసలైన ఛాలెంజ్ అంటే అదే.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

వన్డే ప్రపంచకప్ ఒక్కటే..

రెండు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు(2007, 2024)గెలిచిన రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్ వెలితిగా ఉంది. అతని సారథ్యంలో భారత జట్టు 2023 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇస్తున్నాయి.వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలబెట్టి సగర్వంగా ఆట నుంచి తప్పుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు.

అదే నా ఏకైక లక్ష్యం.. ఎంతకైనా తెగిస్తా: విరాట్ కోహ్లీ

Also Read

అదే నా ఏకైక లక్ష్యం.. ఎంతకైనా తెగిస్తా: విరాట్ కోహ్లీ

ఇప్పటి వరకు 288 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ 34 శతకాలు, 62 హాఫ్ సెంచరీలతో 11895 పరుగులు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రికార్డ్ రోహిత్ శర్మ పేరిటనే ఉంది. అంతేకాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264 పరుగుల రికార్డ్ కూడా రోహిత్ శర్మదే. శ్రీలంకపై 2014లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌తో టీమిండియా తమ ప్రపంచకప్ 2027 సన్నాహాకాలను మొదలుపెట్టనుంది.

Story first published: Saturday, September 26, 2026, 16:01 [IST]
Other articles published on Sep 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+