Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరికి నా జీవితాంతం రుణపడి ఉంటా: రోహిత్ శర్మ

తన జీవితంలో మరిచిపోలేని వ్యక్తులు ఇద్దరు ఉన్నారని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చిన టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఒకరైతే..తన ఆటను మెరుగుపర్చిన మాజీ ముంబై కోచ్ వాసూ పరాంజపే‌ మరొకరని తెలిపాడు. ఈ ఇద్దరే లేకుండా రోహిత్ శర్మ అనేవాడు ప్రపంచానికి పరిచయం అయ్యేవాడు కాదన్నాడు.

సోనీ నెట్‌వర్క్ ఛానెల్ వేదికగా రోహిత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ'అనే రియాల్టీ షో‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నీ ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరు?'అనే ప్రశ్నకు రోహిత్ ఈ ఇద్దరి పేర్లను బదులిచ్చాడు.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

నన్ను సెలెక్ట్ చేసింది ఆయనే.

'ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి నా ఎదుగుదల వెనుక చాలా మందే ఉన్నారు. కానీ నేను భారత జట్టుకు ఎంపికైనప్పుడు దిలీప్ వెంగ్‌సర్కార్ సర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నారు. ఆయనే నా ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను.

Rohit Sharma Credits Dilip Vengsarkar and Vasoo Paranjpe for Shaping His Successful Career

ఎందుకంటే ఆయనే నాకు అవకాశం ఇవ్వకపోతే టీమిండియాలోకే వచ్చేవాడిని కాదు. దీనికి ముందు నేనను ఏజ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో వాసూ పరాంజపే సర్ కూడా ఎంతగానో సహాయపడ్డారు. క్రికెటర్‌గా ఆయన నన్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు. ఆయనకు కూడా నేను రుణపడి ఉంటా.'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

కేవలం వన్డేల్లోనే..

2007లో రోహిత్ శర్మ భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేలతో పాటు టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో దిలీప్ వెంగ్‌సర్కారే చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నారు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో రోహిత్ శర్మకు అవకాశం కల్పించారు. 2013లో అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో కెరీర్ చివరి దశకు చేరుకున్నాడు.

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించండి: ఆకాష్ చోప్రా

Also Read

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించండి: ఆకాష్ చోప్రా

ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్‌ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. టెస్ట్‌ల్లో 67 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 159 టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఇప్పటి వరకు 291 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 12120 పరుగులతో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, October 20, 2026, 12:48 [IST]
Other articles published on Oct 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+