IND vs NZ: వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించండి: ఆకాష్ చోప్రా
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని భారత జట్టు నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. తుది జట్టులో అవకాశం ఇవ్వనప్పుడు అతన్ని కొనసాగించడం అనవసరమని అభిప్రాయపడ్డాడు. జట్టు నుంచి రిలీజ్ చేస్తే రంజీ ట్రోఫీ ఆడుకుంటాడని తెలిపాడు.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ కూడా వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కదని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగుతుండటంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం లేకుండా పోయింది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ అతనికి అవకాశం దక్కలేదు. జపాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో అతను చివరిసారిగా ఆడాడు. అక్కడి కండిషన్స్‌కు తగ్గట్లు ఎక్స్‌ట్రా బ్యాటర్ అవసరం ఏర్పడటంతో వైభవ్‌కు అవకాశం ఇచ్చారు.
జట్టులో ఖాళీ లేదు..
ప్రస్తుత భారత టీ20 జట్టులో వైభవ్‌కు చోటే లేదని ఆకాష్ చోప్రా అన్నాడు. టాపార్డర్ బ్యాటర్లను రొటేషన్ పద్దతిలో ఉపయోగిస్తే తప్పా వైభవ్‌కు అవకాశం దక్కదని, కానీ మేనేజ్‌మెంట్ అలా చేయడం లేదన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'వైభవ్ సూర్యవంశీకి అవకాశం రాకపోవడానికి కారణం జట్టులో ఖాళీ లేకపోవడమే. అతను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ స్థానంలో మాత్రమే ఆడగలడు. ముగ్గురు ఆటగాళ్లు బాగా ఆడుతున్నప్పుడు వారిని తప్పించి మరో ఆటగాడికి అవకాశం ఇవ్వలేం. ఇది నిరాశ కలిగించే విషయమే. కానీ మరో ఆప్షన్ లేదు. నేను సూచించిన రొటేషన్ విధానాన్ని ఎవరూ అంగీకరించలేదు. రొటేషన్ చేస్తే నలుగురికీ అవకాశం ఇవ్వవచ్చు.
తిలక్‌ను నిందించడం సరికాదు..
సూర్యవంశీని పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేసినప్పుడు జట్టులో కొనసాగించడం అనవసరం. అతన్ని రిలీజ్ చేసి రంజీ ట్రోఫీ ఆడేందుకు అనుమతించాలి. మరోవైపు తిలక్ వర్మ స్థానంలో వైభవ్‌ను ఆడించాలని కోరడం సరికాదు. అతను బాగా రాణించలేదని చెప్పడం కూడా తప్పు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు చేశాడు.
ఆ తర్వాత ప్రపంచకప్ ముందు గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్‌లో సరిగ్గా ఆడకపోయినా.. ఆసియా గేమ్స్‌తో పాటు ప్రస్తుత సిరీస్‌లో ఫినిషర్‌గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి తిలక్ వర్మను అనసవరంగా నిందించడం సరికాదు.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది 8 అంతర్జాతీయ టీ20లు ఆడిన వైభవ్ సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మల కోసం వైభవ్‌కు అవకాశం ఇవ్వడం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


