Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలీవుడ్ హీరోయిన్‌తో చిందేసిన రోహిత్ శర్మ!(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బాలీవుడ్ ఐకాన్ కరిష్మా కపూర్‌తో కలిసి చిందేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సోనీ నెట్‌వర్క్ చానెల్‌లో రోహిత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' షోకు కరిష్మా కపూర్ తన సోదరులు అదర్ జైన్, అర్మాన్ జైన్, వదిన అనిస్సా మల్హోత్రాతో కలిసి ఒక టీమ్‌గా పాల్గొన్నారు.

'శ్రేయస్ అయ్యర్‌ను చంపేస్తా.. అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటా..'

'శ్రేయస్ అయ్యర్‌ను చంపేస్తా.. అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటా..'

ఈ సందర్భంగా కరిష్మా కపూర్‌ ఐకానిక్ సాంగ్ 'లే గయి లే గయి'కి హిట్ మ్యాన్ డ్యాన్స్ చేశాడు. కరిష్మా కపూర్ డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె స్టెప్స్‌ను రోహిత్ అనుకరించే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ వారిని అభినందించారు. కరిష్మా కపూర్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆమెతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని రోహిత్ అన్నాడు. రోహిత్ శర్మ స్టెప్స్‌ను కరిష్మా కపూర్ ప్రత్యేకంగా కొనియాడింది.

Rohit Sharma and Karisma Kapoor s Dance to a Bollywood Classic Goes Viral Ahead of India-New Zealand Series

చాలా సరదాగా సాగిన ఈ షోలో.. రోహిత్ శర్మ చిన్ననాటి ముద్దు పేరు గురించి కరిష్మా కపూర్ ప్రశ్నించింది. కానీ చిన్నప్పుడు తనకు ఎలాంటి నిక్ నేమ్ లేదని రోహిత్ బదులిచ్చాడు. వెంటనే కరిష్మా కపూర్.. తమ కుటుంబంలో మాత్రం అందరికీ ముద్దు పేర్లు ఉన్నాయని చెప్పింది. రోహిత్‌కు కూడా ముద్దుపేరు పెట్టాలనుకుంటున్నానని తెలిపింది.

ఆ ఇద్దరికి నా జీవితాంతం రుణపడి ఉంటా: రోహిత్ శర్మ

Also Read

ఆ ఇద్దరికి నా జీవితాంతం రుణపడి ఉంటా: రోహిత్ శర్మ

హిట్ మ్యాన్ ముద్దు పేరు పూకీ పుల్ షాటర్ అని చెప్పి నవ్వులు పూయించింది. వెంటనే రోహిత్.. కరిష్మా కపూర్ ముద్దు పేరు లోలో లవ్ అని చెప్పాడు. సోనీ నెట్ వర్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సోనీ లివ్‌లో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీతో పాటు సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Story first published: Friday, October 23, 2026, 21:05 [IST]
Other articles published on Oct 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+