Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'శ్రేయస్ అయ్యర్‌ను చంపేస్తా.. అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటా..'

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచారు. ఇటీవల్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా ఆడిన 'కిల్, మ్యారీ, హుకప్' గేమ్‌లో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లలో ఎవరిని ఎంచుకుంటారని అడిగిన ప్రశ్నకు.. "శ్రేయస్ అయ్యర్‌ను చంపేస్తా, అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటా, శుభ్‌మన్ గిల్‌తో హుకప్ అవుతా' అని ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

అనయ బంగర్ గతంలో ఆర్యన్ బంగర్‌గా ముంబై తరఫున పురుషుల క్రికెట్ ఆడేవారు. అయితే 2022లో ప్రారంభమైన ట్రాన్సిషన్ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది మార్చిలో లింగ మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం క్రికెట్ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించడానికి ఆస్ట్రేలియా వెళ్లే యోచనలో ఉన్న ఆమె.. ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులు మహిళల క్రికెట్లో పోటీపడేలా క్రికెట్ ఆస్ట్రేలియా రూపొందించిన నిబంధనలను బీసీసీఐ కూడా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

Anaya Bangar Viral Interview Comments on Shreyas Iyer Shubman Gill Abhishek Sharma and Transgender Cricket Rules

అయితే ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను మహిళల విభాగంలో అనుమతించడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానే కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అనయ బంగర్.. "ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడిందో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు ఎలాంటి అదనపు శారీరక ప్రయోజనం లేదని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తర్వాత నాపై 12 వారాల పాటు మాంచెస్టర్ యూనివర్సటీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనలు చేసింది. నా శారీరక సామర్థ్యాలు సాధారణ మహిళా అథ్లెట్ స్థాయిలోనే ఉన్నాయని ఆ పరీక్షల్లో తేలింది" అని అనయ బంగర్ స్పష్టం చేశారు.

6, 4, 6, 1, 6: వాన రాకపోయి ఉంటే.. వెస్టిండీస్ బౌలర్ల పని ఖతమే!

Also Read

6, 4, 6, 1, 6: వాన రాకపోయి ఉంటే.. వెస్టిండీస్ బౌలర్ల పని ఖతమే!

జెండర్ సర్జరీ తర్వాత తనకు టెస్టోస్టిరాన్ స్థాయిలో 0.6 నానోమోల్స్ కు పడిపోయానని.. దీనివల్ల ఎముకల సాంద్రత తగ్గి కండరాల బలహీనత, స్టామినా తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నానని అనయ బంగర్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై స్పందిస్తూ.. తాను అనుభవించిన మానసిక, శారీరక వేదన ఇతరులకు తెలియదని పేర్కొన్నారు. నిబంధనలు అనేవి ప్రతి ఒక్కరి వ్యక్తిగత వైద్య నివేదికల ఆధారంగా రూపొందించాలని, నాన్-సిస్జెండర్ క్రీడాకారుల పట్ల క్రీడా ప్రపంచం సానుకూల దృక్పథంతో ఉండాలని ఆమె కోరారు.

Story first published: Sunday, October 18, 2026, 17:56 [IST]
Other articles published on Oct 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+