Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Road Safety World Series 2020: దిగ్గజాలతో క్రికెట్ టోర్నీ.. కెప్టెన్లుగా సచిన్, బ్రెట్ లీ, లారా

Road Safety World Series 2020 Schedule, Teams and Players List

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దిగ్గజ మాజీ క్రికెటర్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం.. ఓ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 16 వరకు జరగనుంది. ఈ టీ20 టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్లు భాగస్వాములు కానున్నారు. మొత్తం ఐదు టీమ్‌ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్‌లోనే లక్షా యాబై వేల మరణాలు..

భారత్‌లోనే లక్షా యాబై వేల మరణాలు..

రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రికెట్‌కు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ప్రయత్నిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతామని సదుద్దేశంతో ఈ టోర్నీ జరుపుతున్నామన్నారు. ఇక ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1.35 మిలియన్లు ఉండగా.. కేవలం భారత్‌లోనే 1,49000 ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోటర్ వాహనాల్లో భారత్ వాటా 2 శాతం ఉండగా.. రోడ్డు ప్రమాదాల మరణాల్లో మాత్రం 11 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.

మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

కెప్టెన్లుగా సచిన్, లారా..

కెప్టెన్లుగా సచిన్, లారా..

ఇక ఈ టోర్నీలో మొత్తం 110 మంది మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. సచిన్ టెండూల్కర్ భారత జట్టును నడిపించనుండగా.. బ్రియన్ లారా( వెస్టిండీస్), బ్రెట్‌లీ(ఆస్ట్రేలియాన), జాంటీ రోడ్స్( సౌతాఫ్రికా), తిలక రత్న దిల్షాన్ (శ్రీలంక) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

భారత జట్టులో..

భారత జట్టులో..

సచిన్ సారథ్యం వహిస్తున్న భారత జట్టులో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్టార్ పేసర్లు జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్‌లు ఆడనున్నారు. ఇక సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కల్లీస్.. , శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ దరణ్ కూడా బరిలోకి దిగనున్నారు. వయకామ్ 18 ఈ మ్యాచ్‌లకు అధికారిక బ్రాడ్ కాస్టర్‌ భాగాస్వామిగా వ్యవహరించనుంది. కలర్స్ సినిప్లెక్స్ వేదికగా ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి.

India vs Pakistan: ఇట్స్ సో క్యూట్.. ఇట్స్ సో నైస్.. ఇట్స్ సో సూపర్ రనౌట్!!

Story first published: Tuesday, February 4, 2020, 20:57 [IST]
Other articles published on Feb 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+