India vs Pakistan: ఇట్స్ సో క్యూట్.. ఇట్స్ సో నైస్.. ఇట్స్ సో సూపర్ రనౌట్!!

పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీస్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ విచిత్రంగా రనౌటయ్యాడు. క్రీజులో సమన్వయ లోపంతో ఇద్దరు ఒకవైపే పరుగెత్తడంతో వికెట్ సమర్పించుకున్నాడు. పాక్ ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
ఔట్.. నువ్వా నేనా?
స్పిన్నర్ రవి బిష్ణ్నాయ్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని ఖాసిమ్ అక్రమ్ కవర్స్ మీదుగా డ్రాప్ షాట్ ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే నాన్ స్ట్రైక్‌లో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ నజీర్.. తొలుత రన్ కోసం ముందుకు కదిలాడు. కానీ భారత ఫీల్డర్ అంకోలేకర్ బంతినందుకోవడం గమనించిన అతను నాన్ స్ట్రయికర్ వైపు మళ్లాడు. అయితే అప్పటికే అంకోలేకర్ బంతిని కీపర్ దృవ్ జూరెల్‌కు అందజేశాడు.
ఇక నజీర్ యూటర్న్‌తో గందరగోళానికి గురైన ఖాసిమ్ కూడా నాన్ స్ట్రైకర్ వైపు పరుగెత్తాడు. ఇద్దరూ ఒకేవైపు రన్నింగ్ చేయడం.. ఫీల్డర్ తన చేతిలో ఉన్న బంతిని కీపర్ వైపు విసరడం అంతా మెరుపు వేగంగా జరిగిపోయాయి. అయితే ముందుగా క్రీజ్‌లో బ్యాట్ పెట్టిన నజీర్ మాత్రం బ్రతికిపోయాడు. పరుగు తీసిన ఖాసిమ్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ బాటపట్టాడు. గతంలో సీనియర్ పాక్ ప్లేయర్లు కూడా ఇలాంటి గందరగోళానికి గురై ఔటయ్యేవారు. అయితే ఇప్పడు అదే తరహా కన్ఫ్యూజన్.. అండర్ 19 పాక్ ప్లేయర్లలోనూ కనిపించింది.
మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్
ఫన్నీ కామెంట్స్..
ఈ రనౌట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్విటర్ వేదికగా ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఫన్సీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. పరుగు తీయాలనుకున్నారా? లేక పరుగుపందెం అనుకున్నారా? అని ఒకరు.. సీనయర్లు మించిపోయారుపో.. అని మరొకరు ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరూ ఇట్స్ సో క్యూట్.. ఇట్స్ సో నైస్.. ఇట్స్ సో సూపర్ రనౌట్ అంటూ పాట కూడా పాడుతున్నారు.
శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

భారత్ లక్ష్యం 173
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును రక్షణాత్మక ధోరణిలో పడేశారు. వారి ధాటికి పాక్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది.ఆ జట్టులో ఓపెనర్ హైదర్ అలీ(56), కెప్టెన్ నజీర్(62), మహ్మద్ హారీస్(21) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా(3/28) మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అథర్వ అంకోలేకర్, యశస్వీ జైస్వాల్‌కు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications