Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: రిషభ్ పంత్ భారీ సిక్సర్.. బద్దలైన సోలార్ ప్యానెల్!(వీడియో)

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ భారీ సిక్సర్ బాదాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. అతను కొట్టిన భారీ సిక్సర్‌కు స్టేడియంలోని రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ బద్దలైంది.

ఈ సిక్సర్‌ను చూసి అంపైర్లతో పాటు ఆటగాళ్లు, కామెంటేటర్లు నోరెళ్లబెట్టారు. వారెవ్వా పంత్.. వాటే షాట్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs SL: మాట పడనప్పుడు.. స్లెడ్జింగ్ చేయవద్దు: జడేజా

IND vs SL: మాట పడనప్పుడు.. స్లెడ్జింగ్ చేయవద్దు: జడేజా

అసలేం జరిగిందంటే..?

తొలి రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. రెండో రోజు ఆట ఆరంభంలోనే సారాన్ష్ జైన్ ఔటవ్వగానే క్రీజులోకి వచ్చాడు. తనకే సాధ్యమైన దూకుడుతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో లాహిరు కుమార వేసిన 90వ ఓవర్‌లో కళ్లు చెదిరే భారీ సిక్సర్ బాదాడు.

Rishabh Pant Massive Six Breaks Solar Panel During India vs Sri Lanka 2nd Test at Colombo

ఈ ఓవర్ ఐదో బంతిని లాహిరు కుమారా.. లెగ్ సైడ్ షార్ట్‌ బాల్‌గా వేయగా.. రిషభ్ పంత్ ఫైన్‌లెగ్ దిశగా పుల్‌షాట్ ఆడాడు. అతని బ్యాట్ స్వింగ్ ధాటికి స్టేడియం పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ బద్దలైంది. అదే జోరు కొనసాగించిన పంత్.. 81 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ధ్రువ్ జురెల్ సైతం 97 బంతుల్లో అర్ధశతకం సాధించడంతో భారత్ స్కోర్ 400 మార్క్‌ను ధాటింది.

IND vs SL: శ్రీలంక ఆటగాడితో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై నిషేధం!

Also Read

IND vs SL: శ్రీలంక ఆటగాడితో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై నిషేధం!

భారీ స్కోర్ దిశగా భారత్..

300/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ సారాన్ష్ జైన్(6)ను అసితా ఫెర్నాండో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. ధ్రువ్ జురెల్‌తో కలిసి చెలరేగాడు. ధ్రువ్ జురెల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. లంచ్ బ్రేక్ సమయానికి 112 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది.

దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) మరో శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా(43), యశస్వి జైస్వాల్(45) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు.

Story first published: Monday, August 24, 2026, 12:15 [IST]
Other articles published on Aug 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+