Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవిపై కన్నేసిన రవీంద్ర జడేజా.!

టీమిండియాపై చీఫ్ సెలెక్టర్‌ పోస్ట్‌పై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కన్నేసాడు. చీఫ్ సెలెక్టర్ కావాలంటే ఏం చేయాలని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4న ముగిసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో నయా సెలెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట్‌పై స్పందించిన జడేజా.. 'సెలెక్టర్ పదవికి ప్రాసెస్ ఏంటి?'అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు. తద్వారా చీఫ్ సెలెక్టర్ కావాలనే తన కోరికను బయటపెట్టుకున్నాడు.

IND vs WI: 27 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన రవీంద్ర జడేజా.. మరో వికెట్ తీస్తే..!

IND vs WI: 27 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన రవీంద్ర జడేజా.. మరో వికెట్ తీస్తే..!

అగార్కర్ తప్పుకోవడంతో..

భవిష్యత్తులో తప్పకుండా ఈ పదవి చేపడుతాననే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా టెస్ట్, వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు 2023 జులైలో బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

Ravindra Jadeja Reacts to BCCI Selector Vacancy With Hilarious Post After Ajit Agarkar s Exit

రోహిత్ శర్మ విషయంలో అతను బాగా హర్ట్ అయ్యాడని, దాంతో చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అగార్కర్ హయాంలో భారత్ 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని మూడు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకుంది. టెస్ట్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.

వన్డే ప్రపంచప్ ప్రణాళికల్లో జడేజా..?

సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే జడేజా వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అంతకుముందు అఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లకు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే గత కొంతకాలంగా వన్డేల్లో జడేజా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 2025 నుంచి ఆడిన గత 15 వన్డేల్లో జడేజా 29.80 సగటుతో 149 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ 47.93 సగటుతో 14 వికెట్లే పడగొట్టాడు. ఈ ఏడాది ఆడిన 5 మ్యాచుల్లో కేవలం 2 వికెట్లు తీసి, 43 పరుగులే చేశాడు. దాంతోనే వన్డేల్లో అతన్ని కొనసాగిస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది.

అజిత్ అగార్కర్‌పై వేటు‌కు ఆ ఇద్దరే కారణం!

Also Read

అజిత్ అగార్కర్‌పై వేటు‌కు ఆ ఇద్దరే కారణం!

వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ జడేజాకు అండగా నిలిచాడు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో జడేజా కచ్చితంగా ఉంటాడని తెలిపాడు. 'జడేజా ఒక మంచి ఆల్‌రౌండర్. అతని అనుభవం జట్టుకు ఎంతో అవసరం. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగానే జడేజా అనుభవం కూడా జట్టుకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది.'అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 8, 2026, 13:09 [IST]
Other articles published on Oct 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+