IND vs WI: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆసియా గేమ్స్ 2026 కోసం జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, రుతురాజ్ గైక్వాడ్ రీఎంట్రీ ఇచ్చారు. అకిబ్ నబీ, నమన్ ధీర్ తొలిసారి టీమిండియా వన్డే జట్టులోకి వచ్చారు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ..
కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సిరీస్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ బ్యాటర్లు చివరిసారిగా ఆడారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో తన రిటైర్మెంట్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లోనూ అదే తరహా ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో కోహ్లీ, రోహిత్ ఉన్నారు.

యశస్వి జైస్వాల్‌కు నిరాశే..
శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు. దాంతో యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఒకవేళ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే రోహిత్‌తో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. అప్పుడు శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగుతాడు. కానీ అతనికి ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ రూపంలో పోటీ ఎదురవ్వనుంది.
వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడనుండగా.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా నితీష్ రెడ్డి ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. అయితే ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే నమన్ ధీర్ బరిలోకి దిగుతాడు. కానీ తిరువనంతపురం పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో సిరాజ్‌కు మంచి రికార్డ్ ఉంది. అకీబ్ నబీ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/నమన్ ధీర్, మహమ్మద్ సిరాజ్.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


