Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జహీర్ ఖాన్ కాదు.. అతని కోసం సీఎస్‌కే బాగా ప్రయత్నించింది: అశ్విన్

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే జహీర్ ఖాన్‌ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కోసం సీఎస్‌కే తీవ్రంగా ప్రయత్నించిందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఆశిష్ నెహ్రా గుజరాత్ టైటాన్స్‌ను వీడేందుకు సిద్దంగా లేకపోవడంతో జహీర్‌ ఖాన్‌ను నియమించిందని చెప్పుకొచ్చాడు.

18 ఏళ్ల పాటు సీఎస్‌కే హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఈ మార్పు అనివార్యమైంది. భారత పేసర్‌గా.. పలు ఐపీఎల్ టీమ్స్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో జహీర్‌ ఖాన్‌ను తమ కోచ్‌గా సీఎస్‌కే ఎంచుకుంది.

IPL 2027: సీఎస్‌కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ నియామకం వెనుక ధోనీ!

IPL 2027: సీఎస్‌కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ నియామకం వెనుక ధోనీ!

ఈ నియామకంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. అద్భుతమైన నిర్ణయమని కొనియాడాడు. 'జహీర్ ఖాన్ నియామకానికి ముందు సీఎస్‌కే.. చాలా మంది కోచ్‌లతో చర్చలు జరిపింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక దశలో ఆశిష్‌ నెహ్రా కోసం సీఎస్‌కే తీవ్రంగా ప్రయత్నించింది. అయితే గుజరాత్‌ టైటాన్స్‌తో నెహ్రా విజయవంతంగా కొనసాగుతున్నాడు. ఆ జట్టును వీడేందుకు అతను ఒప్పుకోలేదు.

Ravichandran Ashwin

నాకు తెలిసినంత వరకు ఇద్దరు భారత మాజీ దిగ్గజాలతో పాటు పలువురు విదేశీ కోచ్‌ల పేర్లను కూడా సీఎస్కే పరిశీలించింది. అయితే వివిధ కారణాలతో కొన్ని ఒప్పందాలు కుదరలేదు. ఈ ఒప్పందం ఏడాది కాలానికి మాత్రమే కావడంతో మరికొందరు ముందుకు రాలేదు.

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

Also Read

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

'జహీర్‌ ఖాన్‌ను ఎంపిక చేయడం అద్భుతమైన నిర్ణయం. అతడు అన్ని అంశాల్లోనూ సరిపోతాడు. తెలివైన వ్యక్తి. క్రికెట్‌ గురించి బాగా తెలుసు. ముఖ్యంగా బౌలింగ్‌ వ్యూహాలపై మంచి అవగాహన ఉంది. ఆటగాళ్లతో కూడా చక్కగా కలిసిపోగలడు. మరోవైపు ధోనీతో జహీర్‌కు మంచి సంబంధం ఉంది. అతడు యువ ఆటగాళ్లతో కలిసి పనిచేయగలడు. హెడ్‌ కోచ్‌గా జహీర్‌కు ఇది కొత్త ఆరంభం. అయితే ధోనీతో అతడి అనుబంధం కారణంగా జట్టు ఒకే దిశలో ముందుకు సాగుతుందని భావిస్తున్నా' అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Story first published: Thursday, September 24, 2026, 12:01 [IST]
Other articles published on Sep 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+