Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: సీఎస్‌కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ నియామకం వెనుక ధోనీ!

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎస్‌కే సోమవారం అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. గత 18 ఏళ్ల పాటు హెడ్ కోచ్‌గా జట్టుకు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఇంగ్లండ్ టెస్ట్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఈ మార్పు అనివార్యమైంది.

అయితే ఈ నియామకం వెనుక సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎస్‌కేకు బాగా తెలిసిన, అనుభవజ్ఞుడైన భారత ఆటగాడిని నియమించాలని ధోనీ చెప్పడంతోనే జహీర్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధోనీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఓనర్ రూపా గురునాథ్‌లతో కూడిన సలహా కమిటీ జహీర్ ఖాన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

సుక్కా, ముక్కా.. హుక్కా! తాగి ఊగిన రిషభ్ పంత్, ధోనీ?(వీడియో)

సుక్కా, ముక్కా.. హుక్కా! తాగి ఊగిన రిషభ్ పంత్, ధోనీ?(వీడియో)

ధోనీ చెప్పడంతోనే..

ధోనీ సలహా మేరకే కోచ్‌ను నియమించాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుంది. అయితే కొత్త కోచ్ నియామకం కోసం చాలా సమయం తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదాని సీఎస్‌కే హెడ్ కోచ్ బాధ్యతలు చేపడుతాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ సీఎస్‌కే మాత్రం జహీర్ ఖాన్‌ను కోచ్‌గా ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

MS Dhoni Had One Condition for Zaheer Khan to Become CSK Head Coach Revealed

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన సీఎస్‌కే జట్టులో భాగమవ్వడం సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని జహీర్ ఖాన్ తెలిపాడు. 'ఒక ఆటగాడిగా సీఎస్‌‌కేతో ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. ఆ పోటీని బాగా ఆస్వాదించాను. ముఖ్యంగా చెపాక్ స్టేడియంలో సూపర్ ఫ్యాన్స్ సృష్టించే వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఫ్రాంచైజీతో కలిసి పని చేసేందుకు ఆతృతగా ఉన్నాను.'అని జహీర్ ఖాన్ తన నియామకంపై ఆనందం వ్యక్తం చేశాడు.

ధోనీకి నమ్మకమైన బౌలర్..

టీమిండియాకు ఆడే సమయంలో ధోనీకి జహీర్ ఖాన్ నమ్మకమైన బౌలర్‌గా ఉండేవాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో జహీర్ ఖాన్ 21 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరఫున 92 టెస్ట్‌లు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడిన జహీర్ ఖాన్.. 100 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2017లో రిటైర్మెంట్ అనంతరం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలో కోచింగ్ పదవులను చేపట్టాడు.

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

Also Read

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

సీఎస్‌కే హెడ్ కోచ్ పదవి రేసులో ఇయాన్ మోర్గాన్, హేమాంగ్ బదానీ నిలిచినప్పటికీ.. ధోనీ మాత్రం జహీర్ ఖాన్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అతనితో ఉన్నచిరకాల స్నేహం, ఆటను కచ్చితంగా అంచనా వేయగల అతని సామర్థ్యం జహీర్‌ ఖాన్‌కు ఈ బాధ్యతలు దక్కేలా చేశాయి.

Story first published: Tuesday, September 22, 2026, 10:03 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+