IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!
వాటాల విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మహేంద్ర సింగ్ ధోనీ విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. సీఎస్‌కేలోని 25 శాతం షేర్లను తనకు అమ్మాలని ధోనీ కోరగా.. ఆ టీమ్ యజమాన్యం నిరాకరించిందని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ వార్తలపై ధోనీ గానీ, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కానీ స్పందించలేదు. దాంతో సీఎస్‌కేకు ధోనీ దూరంగా ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్ ఇచ్చినట్లు తాజాగా ఓ నివేదిక బయటకు వచ్చింది. సీఎస్‌కే హెడ్ కోచ్‌గా లేదా కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ధోనీకి ఆఫర్ ఇచ్చినట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. అయితే ఆఫర్‌పై ధోనీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దాంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వేచి చూస్తుందని తెలుస్తోంది. ధోనీ నుంచి నిర్ణయం వెలువడిన తర్వాత వచ్చే సీజన్‌కు సంబంధించిన ప్రణాళికలను, వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేయాలని సీఎస్‌కే నిర్ణయించినట్లు సమాచారం.

ఐపీఎల్ 2026 సీజన్‌లోచెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు మాత్రమే సాధించి పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది. గాయం కారణంగా ధోనీ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే ధోనీ ఒక సీజన్ మొత్తం ఆడకపోవడం ఇదే తొలిసారి.
అంతేకాకుండా హెడ్ కోచ్‌గా 19 ఏళ్లు సేవలందించిన స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా జట్టును వీడాడు. 2008లో ఆటగాడిగా జట్టులోకి వచ్చిన ఫ్లెమింగ్.. 2009లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో సీఎస్‌కే ఐదు టైటిళ్లు గెలిచింది. అతను తప్పుకోవడంతో సీఎస్‌కే కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎస్‌కే ఆఫర్‌పై ధోనీ తేల్చిన తర్వాతే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టాలనుకుంటుంది. ధోనీ ఏ విషయం చెప్పకపోవడం వల్ల సీఎస్‌కే కార్యకలాపాలన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
అయితే ఐపీఎల్ 2027 సీజన్‌లో ధోనీ ఆటగాడిగా కొనసాగడనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ధోనీని సీఎస్‌కే అనామక ప్లేయర్‌గా రూ.4 కోట్లకు తీసుకుంది. 2024 నుంచి 2026 వరకు సీఎస్‌కే వరుసగా ప్లే ఆఫ్స్ చేరలేదు. ఈ క్రమంలోనే ధోనీ పర్యవేక్షణలో జట్టును పునర్నిర్మించాలని సీఎస్‌కే యోచిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

