Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG మూడో వన్డే: రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే డిసైడర్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌లో సమంగా నిలిచింది. దాంతో లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌ సిరీస్ డిసైడర్‌గా మారింది.

అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల నుంచి తొలగించామని భారత సెలెక్టర్లు రోహిత్ శర్మకు సమాచారమిచ్చారని, భవిష్యత్తు తేల్చుకోవాలని సూచించారని వార్తలు వచ్చాయి. ఆఖరి వన్డే కోసం రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు లార్డ్స్ చేరుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ ప్రచారాన్ని బీసీసీఐ కూడా ఖండించలేదు. ఈ క్రమంలోనే లార్డ్స్ వన్డే రోహిత్ శర్మకు చివరిదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

India Playing XI For 3rd ODI vs England Last Dance For Rohit Sharma Kuldeep Yadav Likely To Replace Injured Washington Sunder

రోహిత్ చెలరేగేనా...?

ఈ సిరీస్‌లో రోహిత్ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి వన్డేలో 11 పరుగులే చేసిన అతను.. రెండో వన్డేలో 26 పరుగులకే ఔటయ్యాడు. కనీసం తన ఆఖరి మ్యాచ్‌గా భావిస్తున్న లార్డ్స్‌లోనైనా సత్తా చాటి తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని, లేదంటే ఈ పుకార్లు అబద్దం కావాలని రోహిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్: కీలక మూడో వన్డేకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్: కీలక మూడో వన్డేకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. అనారోగ్యంతో రెండో వన్డేకు కేఎల్ రాహుల్ దూరంగా కాగా.. తొడ కండరాల గాయంతో వాషింగ్టన్ సుందర్ మూడో వన్డేకు దూరమయ్యాడు. అంతేకాకుండా టీమిండియా కాంబినేషన్‌పై విమర్శలు వస్తున్నాయి.

జట్టులో ఆల్‌రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని, వారిని ఎక్కువగా నమ్ముకోవడం అవివేకమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మూడో వన్డేకు టీమిండియా కూర్పు ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్..?

గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. కాస్త బ్యాటింగ్ సామర్థ్యం కావాలనుకుంటే రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కుతుంది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా జట్టులో కొనసాగుతాడు. కానీ మేనేజ్‌మెంట్‌ కుల్దీప్ యాదవ్‌వైపు ఎక్కువ మొగ్గు చూపవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు.

రోహిత్ శర్మ రిటైర్మెంట్? లండన్‌కు కుటుంబ సభ్యులు!

రోహిత్ శర్మ రిటైర్మెంట్? లండన్‌కు కుటుంబ సభ్యులు!

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అక్షర్ పటేల్, శివమ్ దూబే లోయరార్డర్ బాధ్యతను మోయనున్నారు. సుందర్ స్థానంలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకుంటే.. శివమ్ దూబేను తప్పించి ఎక్స్‌ట్రా పేసర్ లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించవచ్చు. పిచ్ కండిషన్స్‌ను బట్టి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్,ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌ల్లో ఒకర్ని ఆడించాలనుకుంటే గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణలో ఒకరు బెంచ్‌కే పరిమితమవుతారు.

ఇంగ్లండ్‌తో మూడో వన్డే భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్/కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Saturday, July 18, 2026, 7:48 [IST]
Other articles published on Jul 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+