షమీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. అతనికి తీవ్ర అన్యాయం: అశ్విన్
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి సెలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం మరోసారి స్పష్టమైందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అయితే అతనికి ఇంకా టీమిండియా డోర్లు మూసుకుపోలేదని చెప్పాడు.
న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో మహమ్మద్ షమీకి అవకాశం దక్కలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిసారిగా ఆడిన షమీ మళ్లీ భారత జట్టు తరఫున బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకొని దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు.
షమీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు..
తాజాగా ఈ విషయంపై మాట్లాడిన అశ్విన్.. అవకాశం కోసం షమీ వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. 'మహమ్మద్ షమీ ఫిట్‌గా ఉండి రాణించినంత కాలం అతనికి డోర్లు తెరిచే ఉంటాయని నేను భావిస్తున్నా. అయితే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు కూడా బాగా రాణించారు. ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.

కాబట్టి న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన వారంతా అర్హులే. మహమ్మద్ షమీ తన అవకాశం కోసం వేచి చూడాలి. అతనికి ఇంకా డోర్లు తెరిచే ఉంటాయని నేను భావిస్తున్నా. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మహమ్మద్ షమీకి సెలెక్టర్లు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం తెలుస్తోంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
జైస్వాల్‌కు అన్యాయమే..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడాన్ని అశ్విన్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఇది నిజంగా అన్యాయమని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రాకపోవడం వల్ల యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, సెలెక్టర్లు ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
'శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ యశస్వి జైస్వాల్‌కు అసలు ఆడే అవకాశమే ఇవ్వడం లేదు. జైస్వాల్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. రెండు మూడేళ్ల క్రితం అతని బ్యాటింగ్.. ఇప్పటి ఆటను చూడండి. అతనికి అవకాశం ఇవ్వడం టీమ్ మేనేజ్మెంట్ సెలెక్టర్ల బాధ్యత. నేనే సెలెక్షన్ కమిటీ ఉండి ఉంటే చివరి రెండు వన్డేల్లో ఆడించేవాడిని.'అని అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


