IND vs NZ: శుభ్‌మన్ గిల్ సాహసోపేత నిర్ణయం.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సాహోసోపేత నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయని పని చేసేందుకు సిద్దమయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలోని రెండు టెస్ట్‌ల సిరీస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న శుభ్‌మన్ గిల్.. అందుకు తగ్గట్లుగానే సన్నదమయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు.
ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత నెట్ బౌలర్లను న్యూజిలాండ్ పర్యటనకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నెట్స్‌లో కేవలం తనకు మాత్రమే బౌలింగ్ చేసేలా ఐదుగురు నెట్ బౌలర్లను ఎంచుకున్నాడు. వారి ఫుడ్, బెడ్‌తో పాటు అన్ని ఖర్చులను శుభ్‌మన్ గిల్ భరించనున్నాడు.
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..
వాస్తవానికి బీసీసీఐ పలువురు నెట్ బౌలర్లను భారత జట్టుతో పంపిస్తుంది. కానీ న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న శుభ్‌మన్ గిల్ వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇలా సొంత ఖర్చులతో ఓ కెప్టెన్ నెట్ బౌలర్లను తీసుకెళ్లడం భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.

'ఇది ఆసక్తికరమైన విషయం. వన్డే సిరీస్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ భారత్-ఏ జట్టు తరఫున ఆడటం లేదు. అయినప్పటికీ అతను అక్టోబర్ 23, 24 తేదీల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. నలుగురి నుంచి ఐదుగురు నెట్ బౌలర్లను గిల్ తన వెంట తీసుకువెళ్తున్నాడు. వారి ఖర్చులను పూర్తిగా అతనే భరించనున్నాడు.'అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపాడు.
ఇంగ్లండ్ తరహా ప్రదర్శన చేసేందుకు..
ఇంగ్లండ్ పర్యటనలోని ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 754 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే తరహా ప్రదర్శనను న్యూజిలాండ్ గడ్డపై పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు కూడా శుభ్‌మన్ గిల్ దూరంగా ఉన్నాడు. టెస్ట్ సిరీస్‌కు సన్నదమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో చివరి రెండు వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ భారత వన్డే జట్టును నడిపించనున్నాడు.
తీరికలేని షెడ్యూల్ కారణంగానే శుభ్‌మన్ గిల్ భారత్-ఏ తరఫున న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాలతో రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్నాడు. కానీ అక్టోబర్ 18 నుంచి ముల్లాన్ పూర్ వేదికగా జరిగే రెండో రంజీ ట్రోఫీ పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు ముందు రెడ్ బాల్ ప్రాక్టీస్ కోసం అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


