అగార్కర్ తప్పుకోవడంతో వారికి తలుపులు తెరుచుకున్నాయి: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలం ముగియడంతో వెటరన్ ఆటగాళ్లకు తలుపు తెరుచుకున్నాయని మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అగార్కర్ లేకపోవడంతోనే భువనేశ్వర్ కుమార్‌కు నాలుగేళ్ల తర్వాత టీమిండియా పిలుపు దక్కిందని, షమీ రీఎంట్రీ కూడా ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. 2022లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్.. మళ్లీ ఇన్నాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఐపీఎల్‌లో వరుస సీజన్లలో సత్తా చాటినా.. క్రికెట్ విశ్లేషకులు డిమాండ్ చేసినా భువనేశ్వర్ కుమార్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
అగార్కర్ లేకపోవడంతోనే అవకాశం..
ముఖ్యంగా అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఎక్కువగా కుర్రాళ్లకే అవకాశం కల్పించింది. అతని పదవి కాలం ముగియడంతో తాత్కలిక చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలోని సెలెక్షన్ కమిటీనే న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టును ఎంపిక చేసింది.

తాజాగా తన యూట్యుబ్ ఛానెల్ వేదికగా ఈ టీమ్ సెలెక్షన్‌పై మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ సత్తా చాటితే వన్డే జట్టులోకి కూడా పునరాగమనం చేస్తాడని తెలిపాడు.
'భారత సెలెక్షన్ కమిటీ తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంది. అజిత్ అగార్కర్ పదవి కాలం ముగియడంతో వెటరన్ ఆటగాళ్లకు తలుపులు తెరుచుకోనున్నాయి. అగార్కర్ కుర్రాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. దాంతోనే అనుభవం కలిగిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
గాయాలు కాకపోయి ఉంటే..
భువనేశ్వర్ కుమార్ తన పట్టుదలతో సెలెక్టర్ల తలుపులను బద్దలు కొట్టాడు. అతన్ని ఎంపిక చేయడం గొప్ప విషయం. భువనేశ్వర్ రీఎంట్రీతో షమీకి కూడా తలుపులు మూసుకుపోలేదని అర్థం అవుతుంది. జట్టుకు అనుభవం అవసరమైన ఈ సమయంలో అతని రీఎంట్రీ ఎంతో దూరంలో లేదు.
భువనేశ్వర్ కుమార్ నిరాడంబరమైన వ్యక్తి. గాయాలపాలవకుండా ఉంటే అతనికి ఉన్న స్కిల్ సెట్‌తో అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ప్రధాన పేసర్‌గా ఉండేవాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, మంచి పేస్, అద్భుతమైన ఫీల్డింగ్ వంటి నైపుణ్యాలు భువీ సొంతం.
టీ20ల్లో సత్తా చాటితే వన్డేల్లోకి..
న్యూజిలాండ్ పర్యటనలో భువీ సత్తా చాటితే.. వన్డే జట్టులోకి కూడా రీఎంట్రీ ఇస్తాడు. జనాలు కూడా డిమాండ్ చేస్తారు. సౌతాఫ్రికా గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా కొత్త బంతిని పంచుకుంటారని ఆశిస్తున్నాను. సౌతాఫ్రికా వంటి కండిషన్స్‌లో అనుభవం కలిగిన బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే సెలెక్టర్లు భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


